మారుతి జీవితంలో చీకటి రోజులు.. కన్నీరు పెట్టించే విషయాలు     2018-09-17   12:56:49  IST  Ramesh P

యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి తాజాగా శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఏబీఎన్‌లో ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో మారుతి పాల్గొన్నాడు. ఎప్పటిలాగే ఆర్కే తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి మారుతి నుండి ఎన్నో ఆసక్తికర విషయాలను రాబట్టాడు. ఇప్పటి వరకు మారుతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో తెలిశాయి. మారుతి పడ్డ కష్టాలు నిజంగా సినిమాటిక్‌గా ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు సైతం అంటున్నారు.

కుటుంబంను పోషించేందుకు అరటి పండ్ల బండి నడిపిన వ్యక్తి కొడుకు మారుతి. ఒక దిగువ మద్య తరగతి కుటుంబం నుండి వచ్చిన మారుతి కష్టం విలువ తెలిసిన వ్యక్తి. తండ్రికి సాయంగా ఎన్నో సార్లు అరటి పండ్లు అమ్మడంతో పాటు, తిండి లేని రోజులు గడిపిన వ్యక్తి కూడా మారుతి. కేవలం రెండు రూపాయల జిలేబీ తిని కడుపు నింపుకున్న మారుతి ప్రస్తుతం తాను అరటి పండ్లు అమ్మిన రోడ్డుపై జాగ్వార్‌ కారులో తిరుగుతున్నాను అంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల డిస్ట్రిబ్యూషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మారుతి మొదటి చిత్రం ‘ఆర్య’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చిందట. కాని ఆ తర్వాత పంపిణీ చేసిన హ్యాపీ మరియు ఇతర చిత్రాలు దారుణమైన నష్టాలను మిగల్చడంతో పాటు మళ్లీ తన కెరీర్‌ను మొదటికి తీసుకు వచ్చిందని చెప్పుకొచ్చాడు.

The Heart Touching Story Of Director Maruthi-Director Maruthi,Naga Chaitanya,Sailaja Reddy Allugu,Telugu Success Storys,The Heart Touching Story Of Director Maruthi

ఎప్పుడు తాను చేసిన కొన్ని తప్పిదాలతో ఇబ్బందులు పడుతూ ఉంటానని, ఆ తప్పిదాలు చేయకుండా ఉండేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కెరీర్‌ ఆరంభంలో తాను చేసిన చిత్రాలకు విమర్శలు ఎదురయ్యాయి. అయినా కూడా తప్పలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. గుర్తింపు తెచ్చుకునేందుకు బి గ్రేడ్‌ సినిమాలను తీయాల్సి వచ్చిందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. మొత్తానికి మారుతి సినిమా జీవితంకు ముందు చాలా కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంటర్వ్యూలో చెబుతున్నప్పుడు ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరిగాయి.