సెకన్లలో 3 బాటిల్స్ ఫ్లిప్ చేసి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన కుర్రాడు

మనలో చాలా మన టాలెంట్ ఎంటో తెలియక పోవచ్చు.దానిని మనం వెంటనే గుర్తించలేకపోవచ్చు.

 The Guy Who Flipped 3 Bottles In Seconds Created A World Record, Viral Video, Fl-TeluguStop.com

మన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి మనతో చెప్పినప్పుడు నాలో ఇంత టాలెంట్ ఉందా అని ఒక్కోసారి షాక్ అవుతుంటాం.కొన్ని సార్లు మనం సరదాకు చేసే పనులు కూడా మన కెరీర్‌కు ఒక మార్గాన్ని నిర్దేశించవచ్చు.

నేటి యువత అలాంటి అద్భుతాలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.తాజాగా ఓ కుర్రాడు కేవలం కను రెప్ప కొట్టే వ్యవధిలో మూడు వాటర్ బాటిల్స్ ఫ్లిప్ చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు.

కానీ అందులో కొందరే విజయాన్ని చూస్తారు.ఈ రికార్డును వారి పేరు మీద లిఖించుకోవడానికి వాళ్లు రకరకాల ఫీట్స్‌ చేస్తుంటారు.

అందుకోసం రాత్రిపగలు శ్రమిస్తుంటారు.ఇలా కొత్తగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఫీట్ సాధించిన వ్యక్తుల వీడియోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ రెగ్యూలర్‌గా అధికారిక ఖాతాలో పోస్ట్‌ చేస్తుంటుంది.

తాజాగా 3 బాటిళ్లను చాలా వేగంగా ఫ్లిప్ చేసి సరికొత్త గిన్నిస్ రికార్డ్ తన పేరు మీద లిఖించుకున్నాడు బ్రెండన్ కెల్బీ అనే కుర్రాడు.ఈ ఫీట్‌ సాధించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది.

ప్లాస్టిక్ బాటిల్‌ను ఫ్లిప్ చేయడం సాధారణ విషయంగా కనిపించినా, దానికి టెక్నిక్‌ కావాలి.ప్రాక్టీస్ కూడా చాలా అవసరం.

లేకపోతే అనుకున్న విధంగా బాటిల్ నిలబడదు.బ్రెండన్ 3 బాటిల్స్‌ను కేవలం 2.09 సెకన్లలో ఫ్లిప్ చేసి అందరినీ ఔరా అనేలా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందాడు.

గతంలోనూ ఓ ఇండియన్ కుర్రాడు 60 సెకన్లలో చాలా వేగంగా బాటిల్‌ను ఫ్లిప్ చేసి వరల్డ్ రికార్డును 2021 జనవరిలో బ్రేక్ చేశాడు.అబుదాబిలో జోయెల్ మాథ్యూ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.ఇతను కళ్లకు గుడ్డ కట్టుకుని అమెరికన్ జోష్ హోర్టన్ పేరిట ఉన్న రికార్డు టైంలో 27 బాటిల్ ఫ్లిప్‌ చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు.

ఆ తర్వాత కూడా 500 మి.లీ వాటర్ బాటిల్‌ను 60 సెకన్లలో 37 సార్లు ఫ్లిప్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు మాథ్యూ.

బాటిల్ ఫ్లిప్పింగ్ సంబంధించి చాలా వీడియాలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఈ వీడియోలను చూసి బాలీవుడ్ యాక్టర్స్ అక్షయ్ కుమార్, విక్కీకౌశల్ వంటివారు కూడా వాటర్ బాటిల్ ఫ్లిప్పింగ్ గేమ్స్ ఆడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube