దేవుడా: రాష్ట్రంలో ఆ మాంసానికి భారీగా పెరుగుతున్న డిమాండ్..!

కొందరు చేసే పుకార్ల కారణంగా జంతువుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.కరోనా వైరస్ సమయంలో కూడా అనేక వదంతులు వ్యాపించడంతో చాలా జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.

 The Growing Demand For That Meat In The State  Donkey Meat, Viral Latest, Viral-TeluguStop.com

ఒక అబద్ధం ఎంతగా వ్యాపిస్తుందో ఎన్ని జీవరాశుల ప్రాణాలను హరిస్తుందో మాటల్లో చెప్పలేం అంటే అతిశయోక్తి కాదు.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు ప్రజలు పుకార్లను నమ్మి గాడిదలను చంపేస్తున్నారు.

వాటిని కూరగా వండుకొని తింటున్నారు.గాడిద పాలు తాగినా, గాడిద మాంసం తిన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలనైనా తగ్గిపోతాయనే పుకార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు.

దీంతో కనిపించిన గాడిదనల్లా చంపేసి తింటున్నారు.

నిజానికి గాడిదలను చంపటం చట్టరీత్యా నేరం.

అయినా శారీరక దారుడ్యం పెరుగుతుందని, లైంగిక సామర్ధ్యం పెరుగుతుందని, అధిక వీర్య వృద్ధి కలుగుతుందని నమ్మి కొందరు గాడిదలను చంపేసి నేరస్తులు అవుతున్నారు.అయితే గాడిద మాంసానికి డిమాండ్ పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రం నుంచి అనేక గాడిదలు సరఫరా అవుతున్నాయి.

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల సంఖ్యలో గాడిదలు ఉండేవి కానీ ఇప్పుడు కేవలం ఐదు వేలు మాత్రమే ఉన్నాయి.ఎక్కువమంది ప్రజలు ఇటువంటి అపోహలు నమ్మినట్లయితే ఇంకొన్ని రోజుల్లో గాడిదలన్నీ కనుమరుగు కావటం ఖాయం.

Telugu Andhra Pradesh, Donkey Meat, Netizens, Latest-Latest News - Telugu

పుకార్లను నమ్మి గాడిదలను వధించడం కారణంగా ఇక వచ్చే రోజుల్లో గాడిదలను కేవలం జూ లో చూడాల్సిన పరిస్థితి వస్తుందని జంతు సంరక్షణ సంస్థ కార్యదర్శి చెబుతున్నారు.గాడిదలను కాపాడాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని త్వరగా గాడిదలను రక్షించడం పై సర్కారు చర్యలు చేపట్టాలని జంతు సంరక్షణ సంస్థ అధికారులు కోరుతున్నారు.గాడిద మాంసం పై, పాలపై ఉన్న అపోహలను పొట్టి అబద్ధాలేనని ప్రజలు తెలుసుకోవాల్సి అవసరం ఉందని అధికారులు కోరుతున్నారు.ఏది ఏమైనా నిజా నిజాలు ఏమిటో తెలుసుకోకుండా గుడ్డిగా అన్ని పుకార్లు నమ్ముతూ ఏ జంతువు మాంసం కూడా విడిచిపెట్టకుండా తింటే వింత రోగాల బారిన పడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube