కరోనా వేళ పెళ్లి బారాత్ ను వింతగా జరుపుకున్న వరుడు... ఎలాగంటే?

మన ఇళ్లలో పెళ్లి అంటే ఎంత సందడి ఉంటుందో మనం తెలిసిందే.ఇక బంధుమిత్రుల హడావిడి, స్నేహితుల రాకపోకలు ఇలా చాలా రకాల కార్యక్రమాలతో అంతా సందడిగా ఉంటుంది.

 The Groom Who Strangely Celebrated The Wedding Barat At The Time Of Corona-TeluguStop.com

అయితే ఇక పెళ్లి అంతా ఒక ఎత్తు అయితే ఇక పెళ్లి చివరలో బారాత్ ఒక ఎత్తు.ఇక బారాత్ అంటే ఇక డ్యాన్స్ లతో మార్మొగుతూ చాలా హుషారుగా వరుడు, వధువులను సాగనంపుతుంటారు.

అయితే ఇంత కళగా సాగాల్సిన పెళ్లిళ్లు ఇప్పుడు కరోనా వేళ కళ తప్పిందని చెప్పవచ్చు.ప్రభుత్వ నిబంధనల మేరకు అత్యంత సన్నిహిత బంధువులతో మాత్రమే అంతా సామాజిక దూరం పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు.

 The Groom Who Strangely Celebrated The Wedding Barat At The Time Of Corona-కరోనా వేళ పెళ్లి బారాత్ ను వింతగా జరుపుకున్న వరుడు… ఎలాగంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కొన్ని పెళ్లిళ్లు అయితే ఆన్ లైన్ వేదికగా జరుగుతున్నాయి.అయితే కరోనా నిబంధనలు పాటిస్తూనే వినూత్నంగా బారాత్ ను నిర్వహిస్తున్నారు.

తాజాగా రాజస్థాన్ లో ఓ వ్యక్తి జరుపుకున్న బారాత్ వేడుకలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

రాజస్థాన్ అంటే ఎడారికి అత్యంత ప్రసిద్ధి.

ఒంటెల మీద ప్రయాణం అక్కడ నిత్యకృత్యంగా జరుగుతుంటుంది.అయితే కరోనా భయం ఉన్న పరిస్థితులలో తన బంధువులను పెళ్లి కుమార్తె ఇంటికి ఒంటెల మీద తీసుకెళ్లాడట.

మొత్తం పెళ్లి కుమారుడు ఇంటి నుండి పెళ్లి కుమార్తె ఇంటి వరకు సుమారు గంట సేపు ప్రయాణం ఉంటుందని, గంట సేపు ఒంటెల మీద బారాత్ కు వెళ్ళడాన్ని బంధువులు సైతం ఎంతో ఎంజాయ్ చేసారని వరుడు చెప్పడం గమనార్హం.ఇక నెటిజన్లు ఈ తరహా బారాత్ పై రకరాల కామెంట్స్ చేస్తున్నారు.

కరోనా ఇంతలా విజ్రుంభిస్తున్నా సరికొత్తగా బారాత్ చేసావ్ బాస్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

#ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు