పెళ్లికి రావాలి అంటే కచ్చితంగా ఆ పని చేయించుకోవాల్సిందే అంటున్న వరుడు..!

కరోనా మహామ్మారి మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.నిత్యం మాస్క్ ధరించడంతోపాటు, శానిటైజర్ వెంటపెట్టుకోవడం గుంపులు, గుంపులుగా తిరగకూడా దూరం పాటించడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వంటి అలవాట్లను పరిచయం చేసింది.

 The Groom Who Says That He Has To Come To The Wedding Must Do That Work For Sure-TeluguStop.com

ఈ మహామ్మారి వలన భారీ నష్టాలే జరిగిన కొంత మంచే జరిగిందనుకోవచ్చు.ఎందుకంటే మారుతున్న జీవన విధానంతోపాటు మన అలవాట్లు మారిపోయాయి.

పాశ్చాత్త దేశాల పద్దతులను అనుసరించడంతోపాటు.ఆరోగ్యం ఎలాంటి శ్రద్ద చూపించకుండా ఉండే వారికి కరోనా వలన తిరిగి మరచిపోయిన అలవాట్లను అవలంభిస్తున్నారు.

ఇక లౌక్ డౌన్ అనంతరం ప్రభుత్వం వేడుకలను, శుభకార్యాలకు కొన్ని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.వివాహ శుభకార్యాలలో తక్కువ మంది మాత్రమే అతిథులు రావాలని అలాగే కరోనా నియమాలను ఖచ్చితంగా పాటించాలని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఓ యువకుడు తన పెళ్లికి వచ్చే అథిథులకు విచిత్రమైన కండిషన్ పెట్టాడు.తన పెళ్లికి వచ్చే వారు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని టీకా వేసుకున్న వారు మాత్రమే తన వివాహానికి రావాలని కండిషన్ పెట్టాడు.

ఇది తెలిసి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోతున్నాడు.

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన గోకుల్ అనే యువకుడికి విజయవాడకు చెందిన భవ్య అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.

వీరిద్దరి వివాహం జూన్ 5వ తేదీన జరగనుంది.అయితే తన వివాహానికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు మాత్రమే తన పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు.

ఈ విధంగా వరుడు కండిషన్ పెట్టడంతో బంధువులందరూ ఆశ్చర్యపోతున్నారు.వరుడు కండిషన్‏తో వధువు బంధువులు చేసేదేమీలేక విజయవాడలో భవ్య ఆస్పత్రిలో దాదాపు 20 మంది వరకు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

అదే విధంగా వరుడి కుటుంబ సభ్యులు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.కరోనా వ్యాక్సిన్ పట్ల మరికొంతమందిలో అవగాహన తీసుకురావడం కోసం వరుడు పెట్టిన కండిషన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అటు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube