వధువు డాన్స్ చూసి ఏడ్చేసిన వరుడు..!

The Groom Who Cried After Watching The Bride Dance

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.నెటిజన్లకు ఈ తరహా వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు.

 The Groom Who Cried After Watching The Bride Dance-TeluguStop.com

పెళ్లి అనేది జీవితంలో గుర్తిండిపోయే ఒక మధురానుభూతి.అందుకే పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుని ఘనంగా జరుపుకుంటున్నారు.

అలాగే పెళ్లిలో వధువరులు చేసే సందడి అంతా ఇంతా కాదు.వధువరులు ఇద్దరూ కలిసి పెళ్లి మండపంలో చేసే హడావుడి చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది కదా.వధువు డాన్స్ చేయడం, వరుడు ప్రొపోజ్ చేయడం, లేదంటే వధువు వరుడిని ఆటపట్టించడం లాంటి ఫన్నీ సంఘటనలు మనం చాలానే చూసి ఉంటాము.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక పెళ్లి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 The Groom Who Cried After Watching The Bride Dance-వధువు డాన్స్ చూసి ఏడ్చేసిన వరుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఆ వైరల్ అయిన వీడియోలో వధువు తనకు కాబోయే భర్తను ఎలా ఆకట్టుకుందో చూద్దామా.ఈ మధ్య పెళ్లిలో వధువు తనకు కాబోయే భర్త మీద ఎంత ప్రేమ ఉందో తెలపడానికి పాట పాడి, డాన్స్ చేసి తన భావాలను వరుడి ముందు వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే అందాల బొమ్మలాగా తయారయిన పెళ్లికూతురు సర్దార్ కా గ్రాండ్ సన్ సినిమాలోని మే తేరి హో గయి అనే హిందీ పాటకు చక్కగా డాన్స్ చేస్తూ తనకు తన భర్త మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది.

నేను నీ దాన్ని.నన్ను ఎట్టి పరిస్థితులలో వదలకు అని ఎంతో భావోద్వేగంతో సాగె ఈ పాట విని వరుడు బాగా ఎమోషనల్ అయ్యి కంటతడి కూడా పెట్టేసాడు.ఇది చూసిన పెళ్లి కూతురు డాన్స్ చేస్తూనే తన కాబోయే భర్త దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకుని స్టేజి మీదకు తీసుకెళ్ళింది.

వరుడి కంట వెంబడి కారుతున్న ఆనంద భాష్పాలను తుడిచి అక్కడి వారిని ఆకట్టుకుంది.ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త క్షణాల్లోనే వైరల్ గా మారింది.

వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ నూతన వధూవరుల జంటను చూసి ముచ్చటపడుతున్నారు.

#Marraige #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube