తెలుగు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన గ్రేట్ ఖలి!  

ది గ్రేట్ ఖలి అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు వుండరు. ఇండియా నుంచి డబ్యూ డబ్యూ డబ్యూ ఎఫ్ లాంటి హెవీ వెయిట్ బాక్సింగ్ లో పార్టిసిపేట్ చేసిన మొదటి భారతీయుడుగా ఖలి పేరు రికార్డ్స్ లో ఉండిపోతుంది. అతను అప్పుడప్పుడు సినిమాలలో కూడా మెరుస్తూ ఉంటాడు. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో ఖలి సినీ ప్రేక్షకులని అలరించాడు. అయితే మొదటి సారి ఊహించని విధంగా తెలుగు ప్రేక్షకులని కూడా ఖలి అలరించడానికి రెడీ అయ్యాడు.

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు, స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన జయంత్ సి పరాన్జీ ప్రస్తుతం కొత్త హీరోతో నరేంద్ర అనే సినిమాని స్టార్ట్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహాబలుడు ఖలి కూడా తెలుగు ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు. నరేంద్ర సినిమాలో ఓ కీలక పాత్రలో ఖలి నటిస్తున్నట్లు దృవీకరించిన దర్శకుడు తాజాగా అతను సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చినట్లు ఫోటో షేర్ చేసి కన్ఫర్మ్ చేసాడు. మరి తెలుగు ప్రేక్షకులని ఖలి ఎ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడు అనేది వేచి చూడాలి.