వైరల్: చిరుత పక్కనే ఉన్నా దర్జాగా గడ్డి తిన్న ఏనుగు...!

ఈ మధ్యకాలంలో అనేక రకాల జంతువుల గురించి, వాటికి సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి.అడవుల్లో జంతువుల సంరక్షణార్థం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా అనేక సన్నివేశాలను ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం.

 Susanth Nanda, Ifs Officer, India, Leopard, Elephant, Forest, Elephant Drinking-TeluguStop.com

అంతేకాకుండా భారతదేశానికి సంబంధించిన కొంత మంది ఐఎఫ్ఎస్ అధికారులు జంతువులకు సంబంధించి వివిధ రకాల వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తూ జంతువుల ప్రేమికులను తెగ ఆనందింప చేస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా చిరుత, ఏనుగు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో ఏనుగుల గుంపు అటుగా వెళుతూ ఉండగా చిరుతపులి వాటిని చూసింది.చిరుత పులి వాటిని చూసి కూడా సైలెంట్ గానే ఉంది.ఏనుగులు కూడా చిరుత పులిని చూసి ఏమాత్రం బెదరకుండా వాటికి కావాల్సిన గడ్డిని లాక్కొని తిన్నాయి.అడవి జంతువులలో చాలా వేగంగా వేటాడి తినే జంతువుగా చిరుత మొదటగా ఉంటుంది.

అయితే అటుగా వచ్చిన ఏనుగు గుంపు దగ్గరలోని చిరుతను చూసి జారుకోగా.అందులో ఉన్నా ఒక ఏనుగు మాత్రం చిరుత పక్క నుండే వెళ్లి తనకు కావాల్సిన గడ్డిని తిన సాగింది.

ఆ తర్వాత గడ్డి తింటున్న ఏనుగును చిరుత గంభీరంగా చూడగా… తనకు ఏమీ పట్టనట్లు తన పని తాను కానిచ్చింది ఏనుగు.

ఈ వీడియో ను ప్రముఖ భారతదేశ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు.

అందరికీ తెలిసిన విధంగానే చిరుతలు చాలా వేగంగా వేటాడగలవు.అలాగే, గడ్డి పొదలలో కలిసిపోయి అటుగా వచ్చిన జంతువుల్ని చంపి తినగలవు.కాకపోతే చిరుత పులులు ఎప్పుడు పడితే అప్పుడు వేటాడవు.కేవలం వాటికి ఆహారం కావలిసినప్పుడు మాత్రమే వేటాడి జంతువులను వేటాడి తింటాయి.

ఆ ఏనుగు అటుగా వచ్చిన సమయంలో చిరుతకి ఆకలి లేదేమో కాబోలు.అటుగా వచ్చిన ఏనుగును ఏమీ అనుకోకుండా అలాగే ఉండిపోయింది.

దీంతో ధైర్యంగా దాని దగ్గరకు వచ్చి ఆహారం తినేసి వెళ్ళింది.ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో జంతువుల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను ప్రపంచం నలుమూలల అందరూ తెలుసుకుంటున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube