మరోసారి కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేసిన గవర్నర్ ?

గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య పరోక్ష విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అధికారిక పర్యటనలలో ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ గవర్నర్ నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నా, ఆయన హాజరు కావడం లేదు.

 The Governor Who Once Again Indirectly Criticized Kcr ,kcr, Brs, Telangana Gover-TeluguStop.com

ఈ అంశాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా గవర్నర్ ప్రస్తావిస్తూ వస్తున్నారు.

అంతేకాదు కేసిఆర్ తీరుపై అనేక సందర్భాల్లో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక మహిళ, గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం కెసిఆర్ ఇవ్వడం లేదని ఆమె ప్రత్యక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

Telugu Tamilasai, Telangana-Politics

తెలంగాణ రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పెద్దలు హాజరు కావాల్సి ఉన్నా, కేవలం ఉన్నత అధికారులు మాత్రమే హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ కెసిఆర్ తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు.కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ , తెలంగాణ అంటే ఇష్టం ఎంత కష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తా అంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు.

Telugu Tamilasai, Telangana-Politics

” రాజ్యాంగం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది.తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.తెలంగాణ గౌరవాన్ని నిలబడదాం,  కొందరికి ఫార్మ్ హౌస్ లో కాదు , అందరికీ ఫార్మ్ లు కావాలి.తెలంగాణలో ఆందోళన పరిస్థితులు ఉన్నాయి.తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

తెలంగాణ యువత ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అంటూ గవర్నర్ ప్రసంగించారు.సమ్మక్క, సారలమ్మ, కొమరం భీమ్ లను స్మరించుకున్నారు.” ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం.ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు.

అభివృద్ధి అంటే జాతి నిర్మాణం అంటూ గవర్నర్ ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube