ఆ కుక్క జాతి కోసం ప్రత్యేక హోదా ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం..!

జంతువులలో అత్యంత విశ్వాసం గల జంతువు ఏదైనా ఉంది అంటే అందరూ ఇట్లే చేప్పేస్తారు కుక్క అని.కుక్కను ఎంతో మంది ఇష్టపడి పెంపుడు జంతువుగా వారి ఇంట్లో పెంచుకుంటూ ఉండడం అంత గమనిస్తూనే ఉంటాం.

 The Government Of That Country Has Declared A Special Status For That Dog Breedn-TeluguStop.com

ఇది ఇలా ఉండగా ఒక దేశంనికి చెందిన వారు ఏకంగా కుక్క కోసం 19 అడుగుల ఎత్తయిన బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అంతేకాకుండా తాజాగా ఆ కుక్క కోసం ఏకంగా దేశ వ్యాప్తంగా సెలవుల రోజును  కూడా ప్రకటించారు అంటే నమ్మండి.

Telugu Feets Gold Dog, Statue-Latest News - Telugu

సాధారణంగా నేషనల్ హాలి డే అంటే మన దేశంలో ఎవరైనా ప్రముఖులు, మహనీయుల జయంతి లేదా వర్ధంతి సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉంటాము.కానీ తుర్క్ మెనిస్థాన్ దేశంలో ఒక కుక్క కోసం ఏకంగా నేషనల్ హాలిడే ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.వాస్తవానికి ఆ దేశంలో కుక్కలను ఎంతో గౌరవంగా వారు భావిస్తుంటారు.అందులో ఎక్కువగా అలబాయ్ జాతికి చెందిన కుక్కలను ప్రత్యేక స్థానంతో పాటు గుర్తింపు కూడా ఉంటుంది.

ఆ దేశ ప్రజలు ఎంతో ఇష్టమైన కుక్క కోసం ఆ దేశ రాజధాని అయిన యష్గబత్ నడిరోడ్డుపై 19 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అప్పట్లో కూడా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు  బెర్డ్ ముఖమ్మెదొవ్   ప్రకటన తెలపడంతో మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది.ఇంతకీ ఆ ప్రకటన ఏమిటా అని అనుకుంటున్నారా ? ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి ఆదివారం నేషనల్ హాలిడే గా ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.ఆ రోజును అలా బాబు జాతి కుక్కలకు అంకితం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపాడు.ఆరోజు కేవలం సెలవు రోజు మాత్రమే కాదు ఆ రోజు ప్రత్యేకంగా అందాల పోటీలు, వివిధ రకాల పోటీలను కూడా నిర్వహిస్తారని బెర్డ్ ముఖమ్మెదొవ్  కొడుకు సర్దార్ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube