వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..బ్యాంకు అకౌంట్లలో నెలనెలా రూ.1,000 జమ..

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు తీపి కబురందించింది.మహిళలు ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించేందుకు లాడ్లీ బహ్నా యోజన అనే ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా అర్హత గల ప్రతి మహిళకు నెలకు రూ.1000 ప్రభుత్వం అందించనుంది.ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్( Shivraj Singh Chouhan ) పుట్టినరోజు సందర్భంగా రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు.23 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసున్న మహిళలు ఈ పథకం ద్వారా నెలకు రూ.1,000 పొందవచ్చు.మొదటగా ఎవరెవరికి అర్హత ఉంటుందో వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం నేరుగా ఒక రూపాయి జమ చేయనుంది.

 The Government Has Given Them Good News.. Deposit Rs. 1,000 In Bank Accounts Ev-TeluguStop.com

తర్వాత జూన్ 10వ తేదీన 1,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తుంది.

ఈ ఒక్క రూపాయి ఇప్పటివరకు రాని మహిళలు తాము ఈ డబ్బు పొందేందుకు అర్హులం కాదని గమనించాలి. మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహం ఇచ్చేందుకే ఈ నగదు సాయం చేస్తున్నామని చెబుతోంది కానీ పలువురు మాత్రం ఇది ఎన్నికల స్టంట్ అని విమర్శలు చేస్తున్నారు.కాగా కొత్త పథకం ద్వారా ఒక కోటి 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని సమాచారం.

ప్రభుత్వం నుంచి ఈ డబ్బు పొందెందుకు మహిళలు తమ బ్యాంక్ అకౌంట్లను ఆధార్ కార్డు( Aadhaar card )తో లింక్ చేసుకొని ఉండాలి.వారి కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించి ఉండకూడదు.లేదా ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు ఈ పథకానికి అనర్హులవుతారు.నెలనెలా వచ్చే వెయ్యి రూపాయలతో మహిళలకు ఆర్థికంగా కాస్త ఊరటను ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube