గుడ్ న్యూస్: తొలి దశ టీకా వచ్చేసింది.. కార్యాచరణలో కేంద్రం..  

The good news: the first phase of vaccination has arrived... Centre in action... Coronavirus, Vacine, Narendra Modi, Oxford Asthajenica Vacine, PMO, Central Health Minister Harshavardhan, Police And Doctors, Municipal Workers - Telugu @pmo, Central Health Minister Harshavardhan, Coronavirus, Municipal Workers, Narendra Modi, Oxford Asthajenica Vacine, Police And Doctors, Vacine

భారత దేశంలో ఎప్పుడా.అని ఎదురు చూస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

TeluguStop.com - The Good News The First Phase Of Vacination Has Arrived Centre In Action

కరోనా టీకా తొలి దశ పంపిణీకి కేంద్రప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.తొలిదశలో దేశం లోని 23శాతం మంది జనాభాకు కరోనా టికా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

దీనిలో భాగంగా మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినది.పోలీసులు,పారిశుధ్య కార్మికులకు సైతం వ్యాక్సిన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది.

TeluguStop.com - గుడ్ న్యూస్: తొలి దశ టీకా వచ్చేసింది.. కార్యాచరణలో కేంద్రం..-General-Telugu-Telugu Tollywood Photo Image

వీరిలో అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయంచినట్లు తెలుస్తోంది.

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి.

ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన క్లీనికల్ ప్రయోగాల దశలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎవరికి ముందు ఇవ్వాలి అనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది.

వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి? అన్న విషయాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు.అందులో 50_ 70 లక్షలమంది ఆరోగ్య కార్య కర్తలు, 2 కోట్ల మంది ప్రంట్ లైన్ వర్కర్స్( పోలీస్,మున్సిపల్,సైనిక బలగాలు), 50 ఏళ్ళ వయసు దాటిన వారు 26 కోట్ల మంది ఉండగా, నాలుగో వర్గంలో 50 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్న వారిని చేర్చనున్నట్లు విషయం.

ప్రస్తుతం ఆక్స్పర్డ్ ఆస్త్రాజేనికా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి.పూనేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ కూడా పేజ్ – 3 ట్రయల్స్ నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు నాటికి లేదా డిసెంబరు మొదటి వారంలో వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలియ జేసింది.ఇందులో సభ్యత్వ ముగా కేంద్ర ప్రభుత్వము వ్యాక్సిన్ మొదటి దశ ప్రారంభానికి కార్య చరణ సిద్దం చేస్తోంది.

దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఏ విధంగా పంపిణీ చేయడం అనే విషయముపై చర్చించారు.

ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ వేగవంతంగా అందించేట్లు ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రి తెలిపారు.ఈ ఏర్పాట్లు చేసేటప్పుడు దేశ బౌగోళిక పరిస్థితులు, వైవిధ్యాన్ని దృ ష్టి లో ఉంచుకోవాలని తెలిపారు.

దేశంలో మూడు వ్యాక్సిన్ వివిధ దశలలో ఉన్నాయని పీయంవో తెలిపారు.వీటిలో రెండు వ్యాక్సిన్ల్లు రెండో దశలో ఉండగా .ఒక వ్యాక్సిన్ మూడో దశలో ఉన్నట్టు తెలియజేసింది.కరోనా వైరస్ జన్యుపరంగా స్థిరంగా ఉందని పాన్ ఇండియా సర్వేలు తెలిపాయని పీఎంవో పేర్కొంది.

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ, నీతి ఆయోగ్ సభ్యుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్టు ఫీఎంవో తెలిపింది.

#@PMO #Coronavirus #Vacine #CentralHealth #Narendra Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Good News The First Phase Of Vaccination Has Arrived Centre In Action Related Telugu News,Photos/Pics,Images..