ఆఫీసులో ఫైళ్ల‌ను ఎత్తుకెళ్తున్న మేక‌.. వీడియో చూస్తే న‌వ్వులే

The Goat Who Picks Up The Files In The Office If You Watch The Video

కొన్ని సంఘ‌ట‌న‌లు అంతే.చూస్తేనే చాలా ఫ‌న్నీగా ఉంటాయి.

 The Goat Who Picks Up The Files In The Office If You Watch The Video-TeluguStop.com

ఎవ‌రూ ఎప్పుడూ ఊహించ‌ని విధంగా జ‌రిగే ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి.ఇందులో ఎక్కువ‌గా జంతువుల‌కు సంబంధించిన‌వే ఉంటాయ‌ని తెలిసిందే.

అయితే ఇప్పుడు కూడా ఓ మేక‌కు సంబంధించిన వీడియో బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.అయితే ఇందులో ఆ మేక చేసిన ప‌నికి అంద‌ర‌రూ షాక్ అయిపోతున్నారు.

 The Goat Who Picks Up The Files In The Office If You Watch The Video-ఆఫీసులో ఫైళ్ల‌ను ఎత్తుకెళ్తున్న మేక‌.. వీడియో చూస్తే న‌వ్వులే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే అది చేసిన ప‌ని అచ్చం కోతి చేష్ట లాగే అనిపిస్తోంది.కోతులు ఇలాంటి ప‌నులు సాధార‌ణంగా చేస్తుంటాయి.

కోతులు మ‌న ఇండ్ల‌లోకి వ‌చ్చి లేదంటే ఆఫీసుల్లోకి వ‌చ్చి ఏదో ఒక విలువైన వ‌స్తువుల‌ను తీసుకెళ్లిపోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.అవి అలా ఎత్తుకెళ్లే వాటికి ఇష్టం వ‌చ్చిన చోట ప‌డేస్తుంటాయి.

ఇంకొన్ని సార్లు అయితే ఏదైనా తినే వ‌స్తువు వాటికి ఇస్తే మ‌న వ‌స్తువును కింద ప‌డేస్తుంటాయి.ఇప్పుడు ఓ మేక కూడా ఇలాంటి ప‌నే చేసింది.

అది చేసిన ప‌ని చివ‌ర‌కు ఓ వ్యక్తి ఉద్యోగానికి ఎసరు పెట్టేలా చేసింది.ఈ వైర‌ల్ వీడియోలో ఓ మేక ఓ ఆఫీస్ లోకి దూరిపోయింది.

అయితే ఏదైనా తినేందుకు వ‌చ్చిందేమో అని వారు అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఆఫీసులో ఉన్న ఫైల్స్ అన్నీ నోటితో పట్టుకుని ప‌రుగులు తీసింది.ఇక ఆ మేకను ప‌ట్టుకునేంద‌కు ఈ వ్యక్తి దాని వెన‌కాల ప‌డ్డాడు.ఇక ఆ వ్య‌క్తిని చూసిన మేక మ‌రింత వేగంగా ప‌రుగులు పెడుతుంది.

కానీ ఫైల్స్ ను మాత్రం వ‌దిలిపెట్ట‌లే .ఇలా ఎంత దూరం వెంట పడినా ఆ మేక మాత్రం అత‌నికి చిక్క‌దు.ఈ ఘటన యూపీలోని కాన్పూర్ ప్రాంతంలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.దీన్ని కొంద‌రు వీడియో తీయ‌గా అది కాస్తా అంద‌రినీ తెగ న‌వ్విస్తోంది.దీన్ని చూసిన నెటిజ‌న్లు ఈ మేక ఫైళ్ల దొంగ‌లా ఉందే అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

#Goat #Goat #Animals #Goat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube