ఆన్సర్‌షీట్‌.. ఆ అమ్మాయి వేదనకు వాంగ్మూలం.! ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసినా ఆ విద్యార్థిని.?     2018-10-14   06:37:34  IST  Sai Mallula

గత కొంతకాలంగా ఆ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురవుతుంది. కానీ ఎవ్వరికి చెప్పుకోలేదు. తనలోతానే బాధపడేది. పైగా తనపై దాడి చేస్తున్నది తన మామయ్య తమ్ముళ్లే. సొంత వాళ్లే అలా చేసేసరికి ఏం చేయాలో తెలియక..ప్రశ్న పత్రంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసినా…జవాబులు రాయకుండా తాను పడ్డ ఇబ్బందుల గురించి రాసింది ఆ పదవ తరగతి విద్యార్థిని. అక్టోబరు 1వ తేదీన హర్యానాలోని గురుగావ్‌ జిల్లా బాద్‌షాపూర్‌లో ఈ ఘటన జరిగింది

The Girl Writes A Letter In Exam About Her Problems-

The Girl Writes A Letter In The Exam About Her Problems

పరీక్షా పత్రాలను దిద్దే సందర్భంలో ఈ దారుణం టీచర్‌ దృష్టిలో పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతోన్న ఈ విద్యార్థినిపై వారి పక్కింట్లోనే ఉండే ఆమె మామయ్య, ఇంటర్‌మీడియట్‌ చదువుతోన్న ఆమె పిన్ని కొడుకు ఇద్దరూ కలిసి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ నరకం నుంచి ఎలా బయటపడాలో పాలుపోలేదు.

The Girl Writes A Letter In Exam About Her Problems-

దీంతో యూనిట్‌ టెస్ట్‌లో ఇచ్చిన ఆన్సర్‌ షీట్‌లో గత కొంతకాలంగా తనుపడుతోన్న వేదననంతా రాసింది. ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలన్నింటినీ ఆన్సర్‌షీట్‌లో పేర్కొంది. స్కూల్‌ టీచర్‌ ఈ విషయాన్ని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ దృష్టికి తేవడంతో ఆ అమ్మాయి మామయ్య నీ, ఆమె కజిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు పోస్కోకేసు నమోదు చేసారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శకుంతలా యాదవ్‌ మాట్లాడుతూ.. ఆ బాలిక మామయ్య వాళ్ళ పక్కింట్లోనే ఉంటాడనీ, ఆమె కజిన్‌ వారి ఇంట్లోనే ఉంటున్నట్టు వెల్లడించారు.