వైరల్: లండన్ ఫ్యాషన్ షోలో మీసం మెలేసిన అమ్మాయి..!

సాధారణంగా ఆడవారు తల వెంట్రుకలను పొడవుగా పెంచుకుంటారు.అది ఆడవారికి అదనవు అందాన్ని తెచ్చి పెడుతుంది.

 The Girl With The Mustache At The London Fashion Show Uk’s, Harnaam Kaur, Ente-TeluguStop.com

అలాగే మగవారు మీసాలు, గడ్డాలు పెంచుకుంటారు.అది మగవారికి హుందా తనం తెచ్చి పెడుతుంది.

అయితే ఆడవాళ్లు మీసాలు, గడ్డం పెంచితే ఎలా ఉంటుందో.వారిని సమాజం ఎలా చూస్తుందో.

ఎలాంటి అవమానాలకు గురి చేస్తుందో మనకి తెలుసు.అలాంటి అవమానాలను చాలానే ఎదుర్కొంది ఓ అమ్మాయి.

తనకు మీసం, గడ్డం ఉందనే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె లండన్ ఫ్యాషన్ షో లో మీసం మెలేసి తన గుర్తింపును చాటుకుంది.ఇప్పుడు ఆమె గురించి పూర్తి వివరాలు ఓ సారి చూద్దాం.

బ్రిటన్ కి చెందిన హార్మన్ కౌర్ అనే అమ్మాయికి 11 ఏళ్ళు వచ్చేసరికి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్యతో మగవారిలా మీసాలు, గడ్డాలు రావడం మొదలయ్యాయి. స్కూల్ కి వెళ్తే తోటి పిల్లలు హేళన చేయడంతో స్కూల్ కి వెళ్లనని ఒకటే ఏడ్చేది.

ఆ అవహేళన ఆమె చిన్న వయస్సు పై చెరగని ముద్ర వేసింది.అప్పటికీ మీసం, గడ్డాలు తీసుకునేందుకు వ్యాక్సిన్ కూడా చేయించుకునేది.కానీ అలా చేయడం వల్ల నొప్పితో నరకం కనిపించేది. వ్యాక్సిన్ చేసిన ప్రతిసారి చర్మం కోసుకుపోవడం, గాట్లు పడడం జరిగేవి.

ప్రతి ఐదు రోజులకి మీసం, గడ్డం పెరిగిపోయేవి.దీంతో ఆ బాధలు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.

కానీ ఒక్క క్షణం ఆలోచించింది.

Telugu Beard, Female, Guinness, Harnaam Kaur, Uks-Latest News - Telugu

అన్ని సమస్యలకు చావు పరిష్కారం కాదని, జీవితం అంతం చేస్కోవడాని కంటే.దైర్యంగా బతకాలనుకుంది.అవమానం జరిగిన చోట గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంది.

అంతే అనుకున్నదే తడవుగా తన ముఖానికి వ్యాక్సిన్ చేయించడం ఆపేసి, గడ్డం పెంచడం మొదలు పెట్టింది.అవమానాల నుంచే గుర్తింపు తెచ్చుకోవాలని, తలకు స్టైల్ గా క్లాత్ చుట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆహార్యాన్ని సొంతం చేసుకుంది.

తన గడ్డానికి ముద్దుగా సుందరి అని పేరు పెట్టుకుంది.అప్పట్లోనే గడ్డం పెంచుకున్న అతి పిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆ రికార్డుల్లో స్థానం సంపాదించింది
.

Telugu Beard, Female, Guinness, Harnaam Kaur, Uks-Latest News - Telugu

హర్మాన్ కౌర్ 2014లో లండన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టి తన మీద పడేలా చేసుకుంది.గడ్డంతో ఉన్న మహిళా మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది.అలా అవమానాలనే విజయానికి మెట్లుగా మలుచుకుని అనేక బ్రాండ్లకు మోడల్ గా మారింది.ఇప్పటికీ తన జీవితాన్ని సోషల్ మీడియా వేదిక ప్రపంచానికి తెలియజేస్తూ మోటివేషన్ క్లాసులు కూడా చెబుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube