దెయ్యంలా భ‌య‌పెట్టాల‌నుకున్న అమ్మాయి.. ఎగిరి త‌న్నిన యువ‌కుడు..

ఏదో ఒక‌టి చేసి ఫేమ‌స్ అవ్వాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటారు.ఇక సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిన త‌ర్వాత ఇలాంటి వారు నిత్యం పెరిగిపోతూనే ఉన్నారు.

 The Girl Who Wanted To Scare The Devil The Young Man Kicked Her, Prank Video, Vi-TeluguStop.com

ఈ త‌ర‌హా వీడియోల్లో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు ప్రాంక్ వీడియోలు.ఇవి చూడ‌టానికి చాలా ఫన్నీగా ఉన్నా కొన్ని సార్లు మాత్రం చిరాకు తెప్పిస్తుంటాయి.

ప్రాంక్‌ స్టార్లు జ‌నాలు ర‌ద్దీగా ఉండే చోట ఇలాంటి చేష్ట‌ల‌తో ఆట‌ప‌ట్టించే వీడియోల‌కు బాగానే వ్యూస్ వ‌స్తుంటాయి.ఇలాంటి నెగెటివ్ కంటెంట్‌ను కూడా నెటిజన్లు బాగానే ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే ఇందులో కొన్ని రివ‌ర్స్ కూడా అవుతుంటాయి.

చాలా వ‌ర‌కు దెయ్యం గెట‌ప్‌లో జ‌నాల‌ను భ‌య‌పెట్టే వీడియోలు ఈ మ‌ధ్య బాగా పెరిగిపోతున్నాయి.

ఇలాంటి వీడియోనే చేసిన ఓ అమ్మాయికి పెద్ద షాక్ త‌గిలింది.తాను అంద‌రినీ ఆట ప‌ట్టించాల‌నుకుంటే చివ‌ర‌కు ఆమెనే ఆట ప‌ట్టించాడు ఓ యువ‌కుడు.

ఇక ఈ కంటెంట్ వీడియో నెట్టిట తెగ వైరల్ అవుతోంది.దీన్ని చూసిన వారంతా కూడా తిక్క కుదిరింది అన్న రేంజ్‌లో కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది చూస్తే ఓ అమ్మాయి దెయ్యంలాగా న‌టిస్తూ ఓ బిల్డింగ్‌లోని లిఫ్ట్‌కు ఎదురుగా నిల్చుని భ‌య‌పెడుతుంది.

అయితే ముందుగా లిఫ్టు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఓ యువ‌తిని దెయ్యం వేషంలో ఉన్న అమ్మాయిని చూడ‌గానే పెద్ద‌గా అరుస్తూ బ‌య‌ట‌కు ప‌రుగులు పెడుతుంది.ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన మరో యువతి ప‌రిస్థితి కూడా సేమ్‌.కాగా వీరిద్ద‌రి త‌ర్వాత ఓ వ్యక్తి వస్తూ కాస్త భయంగానే వెళ్లాడు.

దెయ్యాన్ని చూస్తూనే ముందుకు వెళ్లాడు.అయితే ఏమైందో ఏమోగానీ వెంట‌నే వెన‌క్కు వ‌చ్చి దెయ్యం వేషంలో ఉన్న అమ్మాయిని ఎగిరి తన్ని జంప్ అయిపోయాడు.

దీంతో ప్రాంక్ చేద్దామ‌నుకున్న అమ్మాయికి పెద్ద షాక్ త‌గిలిన‌ట్ట‌యింది.ఈ వీడియో అంతా అక్క‌డి కెమెరాల్లో రికార్డు అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube