దేవుడా: యూట్యూబ్ లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ఎవరైనా సరే ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ముందుగా గూగుల్ యూట్యూబ్ లను సంప్రదిస్తూ ఉండటం సహజం.

 The Girl Who Gave Birth To A Child After Watching Childbirth Related Videos On Y-TeluguStop.com

అయితే తాజాగా కేరళలో 17 సంవత్సరాల బాలిక యూట్యూబ్ వీడియోలు చూసి మరి తనకు తానుగా ప్రసవం చేసుకుంది.ఈ క్రమంలో ఆ అమ్మాయి పండంటి పాపకు జన్మనిచ్చింది.మహిళ గర్భం దాల్చడానికి గల కారణ విషయానికి వస్తే.ఎదురింట్లో ఉండే 21 సంవత్సరాలు గల యువకుడు అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఈ క్రమంలో ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు యూట్యూబ్ లో ప్రసారం చేసే వీడియోలు చూసి బిడ్డకు జన్మని ఇవ్వాలని ఆమెకు సలహా ఇచ్చినట్లు, అంతేకాకుండా బొడ్డు తాడు ముడి వేసి కట్ చేయడం ఎలాగో కూడా యూట్యూబ్ ద్వారా చూడాలని సూచించినట్లు సమాచారం.ఇది ఇలా ఉండగా మరోవైపు బాలిక గర్భంతో ఉన్నట్లు ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు తెలియకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

నెలలు నిండిన ఆమె తల్లికి కూడా తెలియక పోవడం ఏంటి అని సందేహాలు తలెత్తాయి.

Telugu Delivery, Born, Kerala, Kerla, Minor Pregnant, Mohter Blind, Pregnant, Yo

కానీ పోలీసుల విచారణలో ఈ సందేహానికి తగిన సమాధానం దొరికిందని చెప్పాలి.అది ఏమిటంటే.ఆ బాలిక తల్లి కి కళ్లు కనపడవని, అలాగే ఆ బాలిక తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.

ఇక చివరకు నిందితులపై ఫోక్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.చివరకి ఇలాంటి విషయాలకి కూడా యూట్యూబ్ ను వినియోగిస్తారు అని అనందించాలో లేక బాధపడలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube