లవ్ ప్రపోజల్ తో ఫిదా అయిన అమ్మాయి.. అతడు ఎక్కడ ప్రపోజ్ చేశాడో తెలుసా..

వ్యక్తులు లవ్ ప్రపోజ్ చేయడానికి ఎంచుకునే స్థలాలు వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.తాము ఇష్టపడే వారికి తమ ఇష్టాన్ని చెప్పడానికి ఎంచుకునే ప్రదేశాలు కొత్తగా ఉండాలని అనుకుంటారు.

 The Girl Who Fell In Love With The Proposal Do You Know Where He Proposed ,  Pro-TeluguStop.com

అలాగే ఓ యువకుడు కూడా అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా తను ఇష్టపడే అమ్మాయిని ఓ పెద్ద కొండ మీదకు తీసుకుపోయాడు.

ఆ కొండ దిగువనే ఓ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది.ఆ జలపాతం ప్రవహించే స్పీడు మామూలుగా ఉండదు.

ఎవరైనా సరే ప్రమాదవశాత్తూ అందులో పడితే ఇక అంతే అనేలా ఉంటుంది.ఈ విధంగా ఉన్న ప్రదేశంలోకి ఓ వ్యక్తి తనకు ఇష్టమైన అమ్మాయిని తీసుకుని వెళ్లి ప్రపోజ్ చేయాలని నిశ్చయించుకుంటాడు.

అలా అనుకున్న యువకుడు ఏం చేశాడంటే.

అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని కొత్త ప్రదేశానికి తీసుకెళ్లిన యువకుడికి చాలా ఉత్సాహం వస్తుంది.

ఇక అక్కడ అతడు మోకాళ్ల మీద కూర్చుని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు.ఇలా అనుకున్నదే తడవుగా తన పాకెట్ లో ఉన్న రింగును బయటకు తీసి ఆ అమ్మాయి వేలికి తొడుగాలని చూస్తాడు.

కానీ అంతలోనే ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఉంగరం జారిపోయి పక్కన ఉన్న జలపాతంలో పడిపోతుంది.దీంతో ఆ అబ్బాయి చాలా నిరాశపడతాడు.

ఆ అమ్మాయి మాత్రం తనకు ఇష్టమైన వ్యక్తికి ఏమీ కాలేదని, ఉంగరం పోతే పోయిందని అనుకుంటుంది.కానీ అంతలోనే ఆ అబ్బాయి తన జేబులోంచి మరో రింగ్ ను తీసి ఆ అమ్మాయిని ఆశ్చర్యపరుస్తాడు.

కింద పడ్డది అసలైన రింగ్ కాదని ఆ వ్యక్తి అమ్మాయితో చెబుతాడు.దీంతో ఆ అమ్మాయి షాక్ కు గురవుతుంది.

తను కూడా ఆ వ్యక్తిని లవ్ చేస్తున్నట్లు చెబుతుంది.ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube