ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల అన్ని పనులు వేగంగా, సక్రమంగా జరుగుతున్నాయి.అంతేకాకుండా కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకోవాలి.
అంతే త్వరగా మోసాలు కూడా జరుగుతున్నాయి.చాలా వరకు స్మార్ట్ ఫోన్ వినియోగించే వాళ్ళందరికీ ఎంతో కొంత జ్ఞానం ఉంటుందని చెప్పాలి.
పైగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దొంగదోపిడి వంటి మోసాలు కూడా వెంటనే తెలిసిపోతూ ఉంటాయి.అలాంటిది ఇప్పటికి కొందరు ఇటువంటి మోసాలను త్వరగా తెలుసుకోలేకపోతున్నారు.
దీనివల్ల చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు.పైగా కొందరు దుండగులు సెలబ్రెటీల పేర్లతో కూడా మోసాలకు పాల్పడుతున్నారు.
మామూలుగా సెలబ్రేటీలు అంటే సామాన్యులు బాగా అభిమానం చూపిస్తూ ఉంటారు.దీంతో వెంటనే సామాన్యులు వారి పేర్ల విషయంలో మోసపోతూ ఉంటారు.
అయితే తాజాగా ఓ అమ్మాయి కూడా ఓ సెలబ్రెటీ పేరు విషయంలో మోసపోయింది.ఇంతకీ ఆ సెలబ్రెటీ ఎవరో కాదు యాంకర్ శివ జ్యోతి.

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శివ జ్యోతి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.వి6 ఛానల్ లో తీన్మార్ వార్తలు చెబుతూ అందర్నీ తన మాట తీరుతో ఆకట్టుకుంది శివ జ్యోతి.అలా ఆమెకు టాలీవుడ్ బుల్లితెరపై బిగ్బాస్ షో లో కూడా అవకాశం వచ్చింది.అలా ఆ షో ద్వారా తెలుగు ప్రేక్షకులతో మరింత పరిచయం పెంచుకుంది.ఇక బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతిలో చాలా మార్పు వచ్చింది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.ఇక ఎప్పటికప్పుడు తన భర్తతో దిగిన ఫోటోలను, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.
ఇక ఒకప్పుడు పద్ధతిగా ఉన్న ఈమె ఇప్పుడు మోడ్రెన్ డ్రెస్ లు వేస్తూ బాగా షో చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె పేరుతో ఒక అమాయకురాలు మోసపోయింది.
ఇంతకు అసలు ఏం జరిగిందంటే.కొందరు మోసగాళ్లు సోషల్ మీడియాలో ఒక అమ్మాయికి శివ జ్యోతి పేరుతో మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నారు.
ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే శివ జ్యోతికి తను మోసపోయిన విషయాన్ని తెలిపింది.

ఇక వెంటనే ఆ విషయాన్ని శివజ్యోతి తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.నాకు అసలు టెలిగ్రామ్ అకౌంట్ లేదు దయచేసి వీటిని అసలు నమ్మకండి అంటూ కాస్త ఆవేదన చెందింది.ఇక ఆ బాధితురాలు చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.
అది చూసి ఈ జనరేషన్ లో కూడా ఏది నిజం ఏది అబద్దం తెలుసుకోలేనంత అమాయకంగా ఉన్నట్టున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.గతంలో కూడా చాలా మంది సెలబ్రెటీల పేర్లతో దుండగులు మోసం చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.







