ఈ 'బేబీ ఇండియా'ను ప్రపంచం అంతా కోరుకుంటున్నారు.. ఈ చిన్నారి ప్రత్యేకత ఏంటో తెలుసా

కొన్ని రోజుల క్రితం అమెరికాలో ప్లాస్టిక్‌ సంచిలో దొరికిన శిశువు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతుంది.ఈ అందమైన శిషువును గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్‌ సంచిలో ఉంచి చెత్త కుప్పలో పడవేశారు.

 The Girl Now Known As Baby India Was Found After Nearby Residents Street Baby-TeluguStop.com

ఈ విషయం సోసల్‌ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసింది.దాంతో ఈ బేబీ గురించిన విషయాలను తెలుసుకునేందుకు అంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ బేబీకి ‘ఇండియా’ అనే పేరు పెట్టడం జరిగింది.ప్రస్తుతం చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లో సంరక్షించబడుతున్న ఈ బేబీ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ 'బేబీ ఇండియా'ను ప్రపంచం అంతా

బేబీ ఇండియాకు పర్మినెంట్‌ అడ్రస్‌ను కల్పించేందుకు బేబీ కేర్‌ సెంటర్‌ వారు ప్రయత్నిస్తున్నారు.అందుకోసం ఎవరైనా ఈ బేబీని దత్తత తీసుకుంటారా అంటూ వారు ప్రశ్నించారు.దాంతో అమెరికా నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా ఈ బేబీని దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.వందల కోట్ల ఆస్తులు ఉన్న వారు ఎంతో మంది ఈ బేబీపై ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ బేబీ ప్రత్యేకత ఏమీ లేకపోయినా కూడా తమకు కావాలంటూ అంత మంది కోరడం అధికారులను ఆశ్చర్యపర్చుతోంది.

చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ నుండి మరి కొన్ని రోజుల్లోనే బేబీని దత్తత ఇచ్చే అవకాశం ఉంది.

ఆ బేబీ గురించి సోషల్‌ మీడియాలో విపరీతమైన ప్రచారం జరగడంతో పాటు చాలా అందంగా ఉండటం మరియు ఆ బేబీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని, ఆమె చాలా గట్టి పిండం అంటూ డాక్టర్లు కితాబు ఇవ్వడమే ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.అందుకే చాలా మంది తమకు బేబీ ఇండియా కావాలని పట్టుబడుతున్నారు.

అయితే అమెరికన్స్‌కు మాత్రమే దత్తత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ 'బేబీ ఇండియా'ను ప్రపంచం అంతా

ఇంతకు చెత్త కుప్పలో దొరికిన ఈ బేబీకి ‘ఇండియా’ అంటూ పేరు ఎందుకు పెట్టారో మాత్రం అర్థం కావడం లేదు.ఈ విషయమై ఇండియన్స్‌ కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం గొప్పగా ఫీల్‌ అవ్వాల్సిన విషయం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube