నా ముందే ఫోజులు కొడ‌తావా అంటూ మ‌హిళ‌పై దాడి చేసిన జిరాఫీ..

మ‌నుషుల‌కు జంతువుల‌కు మ‌ధ్య సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి.జంతువులు కూడా మ‌నుషుల‌ను బాగానే పాలో అవుతున్నాయి.

 The Giraffe That Attacked The Woman Infront Of It Details, Giraffe, Viral Video,-TeluguStop.com

అచ్చం మ‌నుషులు చేసిన‌ట్టు కొన్ని జంతువులు చేయ‌డం కూడా చూస్తున్నాం.ఇలాంటి వైర‌ల్ వీడియోల‌కు నెట్టింట్లో కొదువే లేకుండా పోతోంది.

ఇలాంటి వీడియోల‌కు బాగా వ్యూస్ వ‌స్తున్నాయి.అయితే జంతువుల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఏ మాత్రం తేడా వ‌చ్చినా.వాటి కోపాని బ‌లి కావాల్సిందే.

ఇంతుకు ముందు.ఏనుగుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఇలాగే వెకిలి చేష్ట‌లు చేస్తే.

చివ‌ర‌కు వాటి కోపాని ఆ ప‌ర్యాట‌కులు గురి కావాల్సి వ‌చ్చింది.

అదే కాదు చాలా సార్లు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఎందుకంటే జంతువుల‌కు ఇలాంటివేవీ తెలియ‌దు క‌దా.వాటికి కోపం తెప్పించే ప‌నులు చేస్తే ఎవ‌రినైనా దాడి చేసి గాయ‌ప‌రుస్తాయి.

ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.ఇందులో ఓ జిరాఫీ కూడా ఇలాగే దాడి చేసింది.

అయితే ఇందులో ఓ అమ్మాయి అన‌వ‌స‌రంగా దాని ముందు ఫోజులు కొట్టి చివ‌ర‌కు ఇలా జ‌రిగింది.ఈ వీడియో మీద ఇప్పుడు చాలా ర‌కాల ఫన్నీ కామెంట్లు పేలుతున్నాయి.

మ‌రి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియోలో మ‌నం చూస్తే గ‌న‌క‌.ఓ మహిళ స‌ర‌దాగా ఓ చోట ఉంటుంది.అయితే అక్క‌డ జిరాఫీ కూడా ఉందండోయ్‌.

ఇక జిరాఫీ త‌న‌ను ఏమీ చేయదనుకుందో ఏమో తెలీదు గానీ.దాని ముందు అన‌వ‌స‌ర బిల్డ‌ప్ ల‌కు పోయింది.

త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఫొటోలకు ఫోజులివ్వ‌డం కూడా ఇందులో మ‌న‌కు క‌నిపిస్తుంది.అయితే స‌డెన్ గా ఆ జిరాఫీ తలతో మహిళను పొడిచినట్లుగా చేయ‌డం ఇందులో చూడొచ్చు.

దీంతో ఆ మ‌హిళ బాధ‌ను భ‌రించ‌లేక‌పోతున్న‌ట్టు కూడా క‌నిపిస్తుంది.అంటే అన‌వ‌స‌రంగా దాని ముదు బిల్డ‌ప్ లు ఇస్తే ఇలా కోపానికి వ‌చ్చింద‌న్న‌మాట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube