ది ఘోస్ట్ రివ్యూ: ఈసారి కూడా నాగ్ కు కష్టమేనా?

డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో రూపొందిన సినిమా ది ఘోస్ట్.పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కథగా వచ్చిన ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, సోనాల్ చౌహాన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, బిలాల్ హుస్సేయిన్, సిమ్మి ఘోషల్, వైష్ణవి గన్తరా, జయప్రకాష్ తదితరులు నటించారు.

 The Ghost Review Will It Be Tough For Nag This Time Too The Ghost, Review,direct-TeluguStop.com

శ్రీ వెంకటేశ్వర ఎల్.ఎల్.పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నారాయణదాసు నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావుt, శరత్ మరార్ నిర్మాతలుగా చేశారు.ఈ సినిమాకు మార్క్ కేరోబిన్ మ్యూజిక్ అందించాడు.

ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ సినిమా నుండి విడుదల అయిన లుక్స్, ట్రైలర్ బాగా అనిపించగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.ఈ సినిమాతో నాగార్జున ఖాతాలో హిట్ పడిందో లేదో చూద్దాం.

కథ:

విక్రమ్ అనే పాత్రలో కనిపించాడు నాగార్జున.ఇక ఈయన ఒక రిటైర్డ్ రా ఆఫీసర్ లో నటించాడు.ఈయన ఇండియన్ అంబాసిలో పనిచేస్తాడు.ఇక విక్రమ్ చెల్లెలు కూతురికి ఒక ప్రమాదం జరగటంతో కాపాడమని విక్రమ్ ను అడుగుతుంది ఆవిడా.దీంతో విక్రమ్ తన మేనకోడల్ని రక్షించడానికి సిద్ధం అవుతాడు.

ఇక అదే సమయంలో విక్రమ్ పై క్రిమినల్స్ దాడి చేయడానికి వస్తారు.ఇక ఆ క్రిమినల్స్ కు, విక్రమ్ కు మధ్య ఏం జరిగింది.

చివరికి విక్రం తన మేనకోడల్ని ఎలా రక్షిస్తాడా.లేదా.

ఆ సమయంలో విక్రమ్ ఇంకెన్ని అడ్డంకులు ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

నటినటుల నటన:

రా ఆఫీసర్ పాత్రలో నాగార్జున బాగా నటించినప్పటికీ కూడా కొన్ని సన్నివేశాలలో అంతగా మెప్పించలేకపోయాడు.ఇక హీరోయిన్ సోనాల్ చౌహన్బాగా నటించింది.మిగతా నటినటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ పాత్రకు తగ్గట్టుగా నాగార్జునని బాగానే ఎంచుకున్నప్పటికీ కథనే అంతగా లేదు అన్నట్లుగా అనిపించింది.మార్క్ కేరోబిన్ చక్కని మ్యూజిక్ అందించాడు.ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.మిగతా టెక్నికల్ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

కథ బాలేదు అన్నట్లుగా అనిపించింది.ఎందుకో డైరెక్టర్ కాస్త నిర్లక్ష్యం చేసాడేమో అనిపించింది.

చాలా వరకు అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు కానీ కొన్ని చోట్ల ఏదో మిస్ అయినట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్:

నాగార్జున నటన.బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్

: స్టోరీ, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.యాక్షన్ సన్నివేశాలు.

బాటమ్ లైన్:

నాగార్జున బాగా నటించినప్పటికీ కూడా కొన్ని సన్నివేశాలు నాగర్జునకు అంతగా వర్కౌట్ కాలేదు అన్నట్లుగా అనిపించాయి.ఈ సారి కూడా నాగ్ హిట్ కొట్టడం అనుమానమేనా అన్నట్లు ఉంది.

రేటింగ్: 2.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube