ఆట మొదలైంది.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ ప్రోమో!

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వస్తోంది.ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమైంది.

 The Game Has Started Impressive Bigg Boss Promo Nagarjuna ,bigg Boss, Star Maa, Tollywood, Biggboss Promo, Biggboss Season 6-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం వచ్చే నెల మొదటి వారంలో ప్రసారమవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన సందడి మొదలైందని చెప్పాలి.

గత కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ లోగోని విడుదల చేయగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు.

 The Game Has Started Impressive Bigg Boss Promo Nagarjuna ,bigg Boss, Star Maa, Tollywood, Biggboss Promo, Biggboss Season 6-ఆట మొదలైంది.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ ప్రోమో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రోమోలో భాగంగా పెళ్లి చేసి కూతుర్ని అప్పగింతల సమయంలో తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు.అదే సమయంలోనే బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్ రావడంతో ఒక్కసారిగా అందరూ మాయమవుతారు.

అదే సమయంలోనే నాగర్జున ఎంట్రీ ఇచ్చి మై డియర్ అప్పగింతల వరకు ఆగలేక పోయారు అంటే ఆట మొదలైనట్టే. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే అంటూ నాగార్జున ఈ ప్రోమో ద్వారా మరింత హైప్ క్రియేట్ చేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఎప్పటి నుంచి ప్రసారమవుతుంది అనే విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.బహుశా ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలోని ప్రసారం కానుందని తెలుస్తుంది.ఇకపోతే ఈ ప్రోమో విడుదల కావడంతో ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాత అని తెలియడంతో పలువురు నెటిజెన్లు మిమ్మల్ని చూసి బోర్ కొడుతోంది నాగార్జున అంటూ కామెంట్లో చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube