చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఫలాలు  

The Fruits You Should Eat In Winter In India-

చాలికాలం మొదలైంది.వాతావరణం రోజురోజుకి బాగా చల్లబడిపోతోంది.మరో రెండు రెండున్నర నెలలు దుప్పటి గట్టిగా కప్పుకోక తప్పదు.మరోవైపు చలికాలం అంటే తాజతాజా ఫలాల కాలం.

The Fruits You Should Eat In Winter In India- --

పండ్లు ఇష్టంగా తినగలిగే కాలం.మరి ఈ సీజన్ మార్కెట్ నుంచి మీరు కొనాల్సిన పండ్లు ఏంటో చూద్దాం.* బీటా కెరోటిన్ బాగా ఉండే క్యారట్ ని ప్రేమించండి.

ఐరన్, కాపర్, పొటాషియం మీ శరీరానికి అందిస్తుంది ఇది.చలికాలంలో కీలకంగా మారే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ క్యారట్ చేసి పెడుతుంది.* తక్కువ కాలరీలు కలిగన ఆరెంజ్ వింటర్ లో వింటేజ్ ఫ్రూట్ లాంటిది.

విటమిన్ కె బాగా అందిస్తూ, పొటాషియం, ఫైబర్ వడ్డించి పెడుతుంది.* చలికాలానికి స్పెషల్ ఫ్రూట్ ఆపిల్.ఈ సమయంలో మిగితావాటి మీద కన్నా ఎక్కువ మక్కువ దీనిపైన చూపెట్టండి.

డైటరి ఫైబర్ దండిగా అందిస్తూ, డయాబెటిస్ తో మొండిగా పోరాడుతుంది.* ఇదేమి ఫలం కాదు కాని, పాలకూర కూడా చాలికాలం తినాల్సిన ఆహార పదార్థాలలో ఒకటి.ఫ్లేవోనైడ్స్, క్యారెటోనైడ్స్ లాంటి యాంటి ఆక్సిడెంట్స్ చలికాలంలో మీ ఒంటికి అవసరం.

* బీట్ రూట్ ని మిగితా కాలాల్లో తినడం ఒక ఎత్తు, చలికాలంలో తినడం మరొక ఎత్తు.చాలా లాభకరమైన ఫలం ఇది.గుండెని, ఏముకని, రక్తాన్ని, కిడ్నిని, చెప్పాలంటే మొత్తం శరీరాన్ని బాగా చూసుకుంటుంది.

* పీస్, టర్నిప్, మస్టర్డ్ లీవ్స్ .ఇలాంటి ఆహరం కూడా చలికాలంలో మీ డైట్ లోకి చేర్చుకోండి.