ఐపీఎల్ 2022: స్టార్ క్రికెటర్లకు గాలం వేస్తున్న ఫ్రాంచైజీలు.. ఆ క్రికెటర్ విషయంలోనే ఉత్కంఠ!

ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి ప్లేయర్ల ఎంపిక విషయంలో ఆసాంతం ఉత్కంఠ నెలకొంటోంది.రిటెన్షన్ ప్రక్రియలో పాత ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే విషయం మొన్నటిదాకా ఆసక్తికర అంశంగా మారింది.

 The Franchises That Are Keeping Pace With The Star Cricketers Are Excited About-TeluguStop.com

అయితే ఆ రిటెన్షన్ ప్రక్రియ నవంబరు 30న ముగియడంతో ఇప్పుడు మరో కీలక ఘట్టం ఆసక్తిని రేపుతోంది.రిటైన్ తరువాత మిగిలిపోయిన ఆటగాళ్లలో ముగ్గురు చొప్పున ప్లేయర్లను కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకుని.

ఆ జాబితాను డిసెంబర్ 25లోగా బీసీసీఐకి అందించాల్సి ఉంటుంది.ఈ ప్లేయర్లను మినహాయించి మిగతా వాళ్లందరినీ వేలానికి తీసుకెళ్తుంది బీసీసీఐ.

ఇప్పుడు ఈ ఘట్టమే అందరిలో ఆసక్తిని కలగజేస్తోంది.వేలానికి ముందే కొత్త ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్లను ఎత్తుకు పోకుండా పాత జట్లు భారీ ప్లాన్స్ వేయడమే ఇందుకు కారణం.

డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లు కొత్త ఫ్రాంఛైజీలకు దక్కకుండా పాత ఫ్రాంచైజీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది.ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కోసం పాత జట్లు గాలం వేస్తున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఆస్ట్రేలియా ప్లేయర్, విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సహాయంతో డేవిడ్ వార్నర్‌ను బుట్టలోకి దింపాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

Telugu David, Franchise, Ipl, Latest, Max Well, Cricketer-Latest News - Telugu

వార్నర్, మ్యాక్స్‌వెల్‌ ఇద్దరు కూడా ఆస్ట్రేలియా జట్టుకు చెందిన వారే.అయితే వీరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ఉపయోగించుకుని వార్నర్‌ను తమ వైపు లాగేయాలని ఆర్‌సీబీ ప్రణాళికలు రచిస్తోంది.మరోవైపు విరాట్ కోహ్లీ కూడా వార్నర్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు పచ్చజెండా ఊపాడని టాక్.

దానితో వార్నర్‌ను మ్యాక్స్‌వెల్‌ ద్వారా సొంతం చేసుకోవాలని ఆర్‌సీబీ నిశ్చయించుకుంది.సరైన ప్లేయర్లు లేక ప్రతీసారి ఐపీఎల్ ట్రోఫీ చేజార్చుకుంటున్న ఆర్‌సీబీ ఈసారి టైటిల్ కే నేరుగా గురిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ గొప్ప బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఈ ఫ్రాంచైజీలో చేరితే.జట్టు బలపడటం ఖాయం.

మరి వార్నర్ ఆర్‌సీబీలో చేరతాడా ?లేదా అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube