రామమందిరం నిర్మాణానికి మాజీ క్రికెటర్ భారీ విరాళం.. !- The Former Cricketer Will Make A Huge Donation For The Construction Of The Ram Mandir

cricketer, gautam gambhir, doneation, ram mandhir - Telugu Cricketer, Doneation, Gautam Gambhir, Ram Mandhir

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల అందరి కల.ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న రామ మందిర నిర్మాణ వివాదం ఎట్టకేలకు సమసిపోగా యావత్ భారతదేశ హిందువులు అక్కడ అద్భుతమైన రామాలయం నిర్మించాలనే సంకల్పంతో ఉవ్విళ్లూరుతుండగా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే.

 The Former Cricketer Will Make A Huge Donation For The Construction Of The Ram Mandir-TeluguStop.com

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సైతం రూ.10, 100, 1000 కూపన్ల రూపంలో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది.అదే విధంగా వెయ్యి రూపాయలకు పైగా డొనేషన్‌ ఇవ్వాలనుకునే వారు చెక్కుల రూపంలో అందజేయవచ్చని పేర్కొంది.కాగా ఈ ప్రచార కార్యక్రమంలో ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ తో సహా ఇతర హిందుత్వ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.

వీరంతా ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించనున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీలో ఆరంభించనున్నట్లు బీజేపీ జనరల్‌ సెక్రటరీ కుల్జీత్‌ చాహల్‌ తెలిపారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో సహా ఇతర రంగాల సెలబ్రిటీలు విరాళాలు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ కూడా తన వంతుగా కోటి రూపాయల భారీ విరాళాన్ని అందచేశారు.

#Cricketer #Ram Mandhir #Doneation #Gautam Gambhir

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు