క్రికెట్ చరిత్రలోనే ఆ రూల్ అత్యంత పరమ చెత్త నిబంధన అంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్..!

ఫ్రీ హిట్ దీని గురించి క్రికెట్ అభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరైనా బ్యాట్స్ మెన్ వికెట్ కోల్పోతామనే భయం లేకుండా ఆడే షాట్ ఫ్రీ హిట్ ఎవరైనా బౌలర్ ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత  బాల్ ను ఫ్రీ హిట్ గా క్రికెట్లో పరిగణిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 The Former Cricketer Who Made Sensational Comments That The Rule Is The Worst Ru-TeluguStop.com

వాస్తవానికి ఈ నిబంధన గత ఆరు సంవత్సరాలుగా అమలు అవుతుంది.తొలిసారిగా ఈ నిబంధనను 2015లో ఐసీసీ ప్రవేశపెట్టగా అప్పటి నుండి అందరూ బ్యాట్స్ మెన్ కు ఇది వరంగా మారిందనే చెప్పాలి.

ఇలా ఉండగా తాజాగా ఈ నిబంధన పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.క్రికెట్ చరిత్రలోనే ఇది పరమ చెత్త నిబంధన అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.ఈ నిబంధనపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్‌ లతీఫ్‌ విమర్శల వర్షం కురిపించారు.అసలు నో బాల్ ను  ఫ్రీ హిట్ గా ఇవ్వాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించగా, అలాగే బ్యాట్స్ మెన్ గేమ్ గా మారిపోయిన క్రికెట్ లో ఈ నిబంధనకు అర్థమే లేదు అని విమర్శలు చేశాడు.

ఈ మేరకు రషీద్‌ లతీఫ్ సోషల్ మీడియా వేదికగా అదనంగా పరుగు వస్తున్నప్పుడు ఫ్రీ హిట్‌ అనే నిబంధన అవసరం లేదు. క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రూల్‌.ఈ తరహా నిబంధన వల్ల అవినీతికి ద్వారం సులువుగా తెరిచినట్లే అంటూ తెలిపాడు.ఒక బౌలర్ ఈజీగా బాల్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో దాన్ని ఫిక్సింగ్ అని కూడా వాడుకునే అవకాశాలు ఉన్నట్లు రషీద్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుతం రషీద్‌ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ రంగంలో సంచలనం సృష్టిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube