ఆ రెస్టారెంట్ లో తెగ తినేస్తోన్న భోజన ప్రియులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఢిల్లీలోని ఉన్న ఒక రెస్టారెంట్‌ లో ఉన్న ఐటమ్స్ పేర్లు ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతుంది.ఎందుకంటే ఆ రెస్టారెంట్ లో ఉన్న ఫుడ్ ఐటమ్ నేమ్స్ అక్కడ ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి.

ఆ ఫుడ్ ఐటమ్ పేర్లు వింటే మీకు కూడా నోరు ఊరిపోతోంది.ఎందుకంటే రుచికరమైన ఆహారం తినాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.

మనం ఎంత సంపాందించినా గాని మనిషికి ఆహారం అనేది చాలా ముఖ్యం కదా.అందుకే చాలామంది మంచి రుచికరమైన, టేస్టీ ఫుడ్ తినాలని ప్రయత్నిస్తుంటారు.అలాగే మనదేశంలో గల వివిధ రాష్ట్రాలో ఒక్క రాష్ట్రానికి ఒక్కో వంటకం బాగా ఫేమస్ అని చెప్పాలి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో వైవిద్యభరితమైన ఫుడ్ మనకు లభిస్తుంది.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఒక హోటల్ యాజమాన్యం అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు ఓ విన్నూత్న ఆలోచన చేసింది.అది ఏంటంటే ఆ హోటల్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ కి హీరోయిన్స్ పేర్లు పెట్టి అమ్మకాలు మొదలుపెట్టారు.

అయితే హోటల్ యాజమాన్యం చేసిన ఆలోచన బాగా వర్క్ అవుట్ అయింది.కొద్ది రోజుల్లోనే ఆ ఫుడ్‌కు ప్రజల దగ్గర నుండి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది.

కేవలం డిల్లీ ప్రజలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి కస్టమర్లు ఆ ఫుడ్ కొనుగోలు చేస్తున్నారు.ఆ ఫుడ్ కి అంత క్రెజ్ రావడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు.

ఆ ఫుడ్ కి పెట్టిన హీరోయిన్స్ పేర్లే వాటికి అంత క్రేజ్ తీసుకువచ్చాయి.ఇంతకీ వాటి పేర్లు ఏంటి అనుకుంటున్నారు.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరు గాంచిన మోస్ట్ సెక్సియస్ట్ లేడీ సన్నీలియోన్ పేరుతో పాటు, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేర్లు అక్కడ ఫుడ్ ఐటమ్స్ కి పెట్టారు.అవునండి.

మీరు విన్నది నిజమే.ఇంతకీ ఆ హోటల్ పేరు ఏంటంటే వీర్ జీ మలై చాప్ రెస్టారెంట్‌ అక్కడ హోటల్ మెనూలో సన్నీ లియోన్ చాప్, మియా ఖలీఫా చాప్ అని రెండు పేర్లతో అక్కడ డిషెస్ అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఈ రెండు డిష్‌ లతో పాటు బేబీ డాల్ చాప్, ఆఫ్గాని చాప్ అనే ఫుడ్ ఐటమ్స్ కూడా అందుబాటులో కలవు.అసలు ఫుడ్ ఐటమ్స్ కి ఇలా పేరు పెట్టడానికి కారణం ఒక సినిమాట.అవును రాగిణి ఎంఎంఎస్ 2 సినిమా కారణంగానే ఇలా పేర్లు పెట్టమన రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.ఈ సినిమాలో సన్నీ లియోన్ పాట వలన ఈ వంటకాలకు ఆ పేర్లు పెట్టడం జరిగిందని అంటున్నారు.

ఈ రెస్టారెంట్ లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటోందని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.అసలు ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉందని మనకు తెలియచేసింది ఎవరు అనుకుంటున్నారు ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ గారు.

ఆయనే ఈ రెస్టారెంట్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.దాంతో ఈ రెస్టారెంట్ పేరు మరింత ఫేమస్ అయిపోయింది.దేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ మెనూ, అందులోను పేర్లు బాగా పాపులర్ అయిపోయాయి.ఈ రెస్టారెంట్ గురించి చాలామంది తమకి నచ్చినట్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

కొందరు అయితే బిజినెస్ చేయడానికి ఇదొక ట్రిక్ అని పాజిటివ్ గా ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం మహిళల పేర్లు పెట్టి వాళ్ళను అవమానిస్తున్నారు అని నెగెటీవ్‌ గా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube