ఏ దేవుడికి ఏ పువ్వు ఎందుకు అంత ప్రీతీకరమో తెలుసా?

సాధారణంగా కొన్ని రకాల పుష్పాలతో కొందరి దేవుళ్ళను పూజిస్తే వారు ప్రీతి చెంది స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము.ఈ క్రమంలోనే కొందరి దేవ దేవతలకు ప్రత్యేకించి కొన్ని రకాల పుష్పాలతో పూజిస్తాము.

 The Flowers Which Are Loved By The Gods Lard,  Flowers,  Parijata Flowers, Saras-TeluguStop.com

అయితే ఆ పుష్పాలు ఆ దేవుడికి ఎందుకు అంత ప్రీతికరం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కాళీ మాతకు ఎర్రమందారం అంటే ఎంతో ప్రీతికరం.

ఎర్ర మందారాలతో అమ్మ వారిని పూజించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.అయితే అమ్మవారికి ఎర్రమందారం ఎందుకంత ఇష్టం అనే విషయానికి వస్తే.

కాళీ మాత నాలుక ఎప్పుడు ఎరుపు రంగులో ఉంటుంది కనుక అమ్మవారి నాలుకకు గుర్తుగా కాళీ మాతకు ఎరుపురంగు మందారాలతో పూజ చేస్తారు.ఈ క్రమంలోనే కొందరు భక్తులు 108 ఎర్ర మందారాలను మాలగా కూర్చి అమ్మవారికి సమర్పిస్తారు.

ఇలా చేయటం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తారని భక్తులు విశ్వసిస్తారు.

విష్ణు దేవుడికి పారిజాత పుష్పాలు అంటే ఎంతో ప్రీతికరం.సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి.అలా ఉద్భవించిన వాటిలో పారిజాత వృక్షం ఒకటి.

ఇల సముద్ర గర్భం నుంచి వచ్చిన పారిజాత వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా స్వర్గం మొత్తం సువాసనలు వెదజల్లిందని పురాణాలు చెబుతున్నాయి.అందుకే విష్ణు దేవుడికి పారిజాత పుష్పాలతో పూజిస్తే ఎంతో శుభం కలుగుతుంది.

వినాయకుడికి బంతి పువ్వు అంటే ఎంతో ప్రీతికరం.బంతి పువ్వు ఎప్పుడూ కూడా ప్రతికూల పరిస్థితులను తొలగించి సానుకూలతను పెంచుతుంది.అందుకే ఏదైనా శుభకార్యాలలో బంతి పూలను అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇక సృజనాత్మకతకు మారుపేరు అయిన గోగి పువ్వు సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరం.జ్ఞానానికి తెలివికి ప్రతీకగా నిలిచే ఈ పుష్పాలను సరస్వతీదేవికి సమర్పించడంవల్ల సరస్వతి దేవి తెలివితేటలను జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు.

The Flowers Which Are Loved By The Gods Lard, Flowers, Parijata Flowers, Saraswati , Kalika Matha , Lord Vishnu , Lord Ganesh - Telugu Flowers, Kalika Matha, Lard, Lord Ganesh, Lord Vishnu, Saraswati

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube