ఆడిషన్ కి వెళ్లిన మొదటిరోజే ఘోరంగా అవమానించారు.. సత్యదేవ్ కన్నీటిగాధ!

చాలామందికి సినిమాలలో నటించాలని చాలా కోరిక ఉంటుంది.అంతేకాకుండా పెద్ద హీరో అవ్వాలని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.

 The First Day I Went To The Audition Then Insulted Me By Satyadev-TeluguStop.com

దాంతో ఆడిషన్ లో కూడా పాల్గొంటారు.కానీ అందులో కొన్ని కొన్ని సార్లు తాము కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాళ్ళు చూడటానికి అందంగా ఉండకపోయినా, యాక్టివ్ గా కనిపించకపోయినా ఆడిషన్ లో అందరిముందు అవమానాలు ఎదుర్కొంటారు.ఇదిలా ఉంటే సత్యదేవ్ కూడా అటువంటి అవమానానే ఎదురుకున్నాడట.

 The First Day I Went To The Audition Then Insulted Me By Satyadev-ఆడిషన్ కి వెళ్లిన మొదటిరోజే ఘోరంగా అవమానించారు.. సత్యదేవ్ కన్నీటిగాధ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్.ఈయన తెలుగుతో పాటు హిందీ సినిమాలలో కూడా నటించాడు.ఆంధ్రప్రదేశ్ కి చెందిన సత్యదేవ్ చూడ్డానికి అసలు మామూలు వ్యక్తిలా కనిపిస్తాడు.కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.2011లో ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అందులో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.

ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు.అలా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సత్యదేవ్ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

జ్యోతిలక్ష్మి, క్షణం, బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు వంటి సినిమాలలో మంచి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.

Telugu Audition, Hero, Hyderabad, Insulted, Mr Perfect Movie, Satya Dev First Audition, Satya Dev Insulted, Satyadev, Thimmarusu Movie, Tollywood-Movie

ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.

సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.ఇక ఈయన గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

ఇక తను 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని తెలిపాడు.ఈ సినిమానే తనకు మొదటి అవకాశం అని తెలిపాడు.

ఇక కెరీర్ మొదట్లో తన స్నేహితుడు రుషి ప్రసాద్ ద్వారా హైదరాబాదుకు వచ్చానని ఆ తర్వాత ఆడిషన్ లో పాల్గొన్నానని తెలిపాడు.ఇక ఈయన చూడటానికి కాస్త మొరటుగా ఉన్నాడని యాక్టర్ అయ్యే లక్షణాలు లేవని మొదటి రోజే అలా ఘోరంగా మాటలు అనడంతో చాలా డిప్రెషన్ కు గురయ్యాడట.

Telugu Audition, Hero, Hyderabad, Insulted, Mr Perfect Movie, Satya Dev First Audition, Satya Dev Insulted, Satyadev, Thimmarusu Movie, Tollywood-Movie

ఆ తర్వాత అనవసరంగా వెళ్లానేమో అని.అక్కడ తన గాలి మొత్తం తీసేసాడు అని అనిపించించి బాగా ఎమోషనల్ అయ్యాడట.కానీ ఆ వ్యక్తే తనకు మరుసటి రోజు ఫోన్ చేసి రమ్మన్నాడట.

అయితే అతడు తనను పరీక్షించడానికే అలా చేశాడేమో అని అనగా.

కానీ అతడు అలా అనడం వల్లే ప్రతి ఒక్క సినిమాను చాలెంజ్ గా చేశాను అని తెలిపాడు.దీంతో అప్పటి నుంచి తను చేసినవి చిన్న పాత్ర అయినా లేదా పెద్ద పాత్ర అయినా మంచి సక్సెస్ ను అందుకొని తనకు మంచి గుర్తింపు ఇచ్చిందని తెలిపాడు.

తనకు హిందీలో కూడా పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయని అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నా అని తెలిపాడు.

#Hyderabad #Satya Dev #Satyadev #Thimmarusu #Satya Dev

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు