రాజమౌళిపై మండిపడుతున్న సినీ ఇండస్ట్రీ పెద్దలు.. కారణం అదే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన బాహుబలి సినిమాను తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.

 The Film Industry Leaders Are So Angry On Rajamouli The Reason Is That, Rajamoul-TeluguStop.com

బాహుబలి సినిమా తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది.కేవలం విడుదలకు వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని చిత్రబృందం తెలియజేశారు.

ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల అవుతుందని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగడంతో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకుని వేసవి సెలవులకు విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.

ఇలాంటి సమయంలో ఈ సినిమా వాయిదా పడిందని తెలియడంతో ఎంతో మంది సినీ పెద్దలు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి ఎల్లప్పుడు సినిమా లాభాలు విజయం గురించి మాత్రమే ఆలోచిస్తారు.

ఇతర సినిమా విషయాల గురించి ఆయనకు ఆలోచన లేదని మండిపడుతున్నారు.

Telugu Angry, Rajamouli, Tollywood-Movie

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ఇప్పుడు వాయిదా వేసి తిరిగి వేసవి సెలవుల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వేసవిలో విడుదల చేయాలనుకున్న సినిమాల విషయంలో మరొకసారి గందరగోళం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని సినీ పెద్దలు రాజమౌళి పై మండిపడుతున్నారు.అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడంతో ఇప్పటికే ఉత్తరాది పలు రాష్ట్రాలు కరోనా కారణం వల్ల ఎన్నో ఆంక్షలు విధించి థియేటర్లను మూసివేసిన నేపథ్యంలో చిత్ర బృందం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ నిర్ణయం ఎన్నో సినిమాలను ఇబ్బందులలో పడేసిందని ఇండస్ట్రీలో కొందరు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube