డబ్బులు లేవన్న తండ్రి.. కొట్టి చంపిన కొడుకు..

The Father Who Raised The Money The Son Who Was Beaten To Death

మద్యం మనిషిని మృగంలా మారుస్తుంది.ఎన్నో జీవితాలను ఒంటరిని చేస్తుంది.

 The Father Who Raised The Money The Son Who Was Beaten To Death-TeluguStop.com

ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తుంది.ఎంతో మంది బతుకులలో కన్నీటిని మిగుల్చుతుంది.

ఇక దానికి బానిసైన వారి గురించే వేరే చెప్పాల్సిన అవసరం లేదు.వారు మద్యం మానేయరు.

 The Father Who Raised The Money The Son Who Was Beaten To Death-డబ్బులు లేవన్న తండ్రి.. కొట్టి చంపిన కొడుకు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాని కోసం వారు చేయని పని అంటూ ఉండదు.అవసరమైతే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు.

ఎదుటి వారితో గొడవ పడతారు.హింసిస్తారు, వేధిస్తారు, ప్రశాంతత లేకుండా చేస్తారు.

చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడరు.ఇలాంటి ఘటనలు నిత్యం మనం చూస్తేనే ఉంటాం.ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో తాజాగా జరిగింది.మద్యం కోసం డబ్బులు ఇచ్చేందుకు తండ్రి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన ఓ కొడుకు.తన తండ్రిపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు.తర్వాత కటకటాలపాలయ్యాడు.

జరిగింది ఏమిటంటే.మెదక్​జిల్లాలోని పెద్ద శంకరంపేట మండలం, కోలపల్లి గ్రామానికి చెందిన రోమాల సాయిలు (50) కొడుకు అనిల్‌తో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు.మద్యానికి బానిసైన అనిల్. తరుచూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలో వీరి మద్య గొడవ జరిగేది.డబ్బులు కావాలని అనిత్ నిత్యం తన తండ్రిని వేధించేవాడు.

ఈ క్రమంలోనే రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన అనిల్.డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు.

తన దగ్గర డబ్బులు లేవని తండ్రి బదులిచ్చాడు.దీంతో కోపానికి గురైన అనిల్.

అతని తండ్రిపై దాడికి దిగాడు.ఇష్టం వచ్చినట్టు కొట్టాడు.

దెబ్బలు తాళలేక సాయిలు మృతి చెందాడు.విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు.

కేసు దర్యాప్తు చేస్తున్నారు.

#Father Beaten

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube