మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే.. ?  

the-father who killed the daughter in superstitio Tamil Nadu, Ramanathapuram, father killed, daughter, superstition - Telugu Daughter, Father Killed, Ramanathapuram, Superstition, Tamil Nadu

లోకంలో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.కంప్యూటర్ యుగంలో కూడా వీరి పిచ్చి పీక్ స్టేజీలో వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

TeluguStop.com - The Father Who Killed The Daughter In Superstitio

ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించకుండా కన్న అయిన వారిని కూడా ఈ మూఢ నమ్మకాలకు బలిచేస్తూ సమాజాన్ని హేళన చేస్తున్నారు కొందరు.

ఇక తాజాగా తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది.

TeluguStop.com - మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ వివరాలు చూస్తే.రామనాథపురంలో నివసించే వీరసెల్వంకు మూఢాచారాల పట్ల నమ్మకాలు ఎక్కువట, తాంత్రీక పూజలను కూడా నమ్ముతాడట.

ఈ క్రమంలో తన కూతురు తరుణి(19) అనే యువతికి గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంగా ఉండటంతో, మరణించిన తన భార్య ఆత్మ ఆమెను ఆవహించిందని భావించినా ఆ తండ్రి ఆ ఆత్మను బయటకు పంపించాలని తాంత్రిక పూజలు చేయడం ప్రారంభించాడట.

ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారట.

అదీగాక ఆమె అనారోగ్యానికి కారణం టైఫాయిడ్ అని దీని వల్లే ఆమె మృతిచెందిందని తెలిపారట.కాగా ఆ తండ్రి సకాలంలో గనుక ఆస్పతిలో చేరిపిస్తే ఆ యువతి బ్రతికేదని మూఢనమ్మకాలతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిందని వారు పేర్కొన్నారు.

ఇకపోతే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారట.

#Superstition #Daughter #Father Killed #Ramanathapuram #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు