డబ్బు కోసం బిడ్డను కిడ్నాప్ చేసిన తండ్రి.. చివరకు..!

ప్రస్తుత సమాజంలో మంచి, చెడును గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని ఇతరులకు మంచి చెప్తూ ఆదర్శంగా ఉంటున్నవారు కొందరే.చెడు అలవాట్లను అలవర్చుకుని వాటిని వ్యసనంగా మార్చుకుని ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు.

 The Father Who Kidnapped The Child For Money Finally-TeluguStop.com

మనం తెలుసుకోబోయే ఈ ఘటన ఆ కోవకు చెందినదే.

ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు రెవెన్యూ డివిజన్ పొన్నలూరు మండలం చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి వృత్తి రిత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

 The Father Who Kidnapped The Child For Money Finally-డబ్బు కోసం బిడ్డను కిడ్నాప్ చేసిన తండ్రి.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మల్టీ నేషనల్ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.కరోనా పాండమిక్ దృష్ట్యా ఆఫీసు వాళ్లు వర్క్ ఫ్రం హోం ఇవ్వగా, సొంతూరుకు వచ్చాడు రామకృష్ణారెడ్డి.ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి మద్యం, వ్యభిచారం, జూదానికి బానిసయ్యాడు.జల్సాలు చేయడం షురూ చేసి దాదాపు రూ.20 లక్షలకు పైగా అప్పు చేశాడు.ప్రతీ రోజు ఎంజాయ్‌మెంట్‌కే ప్రయారిటీ ఇస్తూ అప్పులు చేస్తూనే వచ్చాడు.

అప్పులు తీర్చాలని ఇచ్చిన వారు అడగడం ప్రారంభించడంతో సొంత బిడ్డనే కిడ్నాప్ చేసి, డబ్బులివ్వకపోతే బిడ్డను చంపేస్తానని కుటుంబీకులను బెదిరించాడు ఈ కసాయి తండ్రి.ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి భార్య ఉమ, బంధువులు రామకృష్ణారెడ్డి కోసం వెతకడం ప్రారంభించారు.

కానీ, అతడి జాడ దొరకలేదు.

దాంతో పొన్నలూరు పీఎస్‌లో రామకృష్ణారెడ్డి భార్య ఉమ ఫిర్యాదు చేసింది.

లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి రామకృష్ణారెడ్డి జాడను కనుగొన్నారు పోలీసులు.కందుకూరు సిటీలోని స్వర్ణ ప్యాలెస్‌ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించి, పోలీసులు అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అయితే, తాగిన మత్తులోనే ఊగిపోతున్న రామకృష్ణారెడ్డి పక్కనే అతడి కొడుకు శర్వాన్‌రెడ్డి ఉన్నాడు.బాలుడు శర్వాన్‌ను తల్లి ఉమకు అప్పజెప్పారు పోలీసులు.

కేసును ఛేదించిన పోలీసులకు ఉమ, ఆమె బంధువులు థాంక్స్ చెప్పారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించడంతో పాటు కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీఎస్పీ కందె శ్రీనివాసులు ప్రశంసించారు.

#TheFather #Kidnapped Son #Cruel Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు