కొడుకు పుట్టాలని కూతురుని దారుణంగా నరికేసిన తండ్రి!  

father,son,daughter,murdered,Jharkhand, father murdered to a daughter for son in Jharkhand, suman nagasia - Telugu Daughter, Father, Jharkhand, Murdered, Son

మన ఆలోచనలను గెలాక్సీని దాటించిన ఘనత సైన్స్ ది మాత్రమే.ఈ రోజు ఇంత గొప్ప లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే కేవలం సైన్స్ వ‌ళ్లే.

TeluguStop.com - The Father Who Brutally Beheaded His Daughter To Give Birth To A Son

కానీ మనలో ఇంకా చాలా మంది తమ ఆలోచనలను ఆపేసి అనాగరికులు గా జీవిస్తున్నారు.మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా… వాటినే నమ్ముతూ ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నారు.సమస్యలుంటే… డాక్టర్ ను సంప్ర‌దించాలి.ఏం చేయాలని అడగాలి.

అలా కాకుండా జంతు బలి, ఇంకో బలి ఇస్తే సమస్య పరిష్కారం కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు.ముఖ్యంగా ఈ సమాజం లో చాలా మంది అబ్బాయిలకు ఇచ్చే ఇంపార్టెన్స్.

TeluguStop.com - కొడుకు పుట్టాలని కూతురుని దారుణంగా నరికేసిన తండ్రి-General-Telugu-Telugu Tollywood Photo Image

అమ్మాయిలకు ఇవ్వటం లేదు అనేది నిజం.

దానికి కారణాలు ఇప్పటికే ఎన్నో చూసాం.

ఇప్పుడు అలాంటి మరో దారుణం జార్ఖండ్ లో జరిగింది.ఒక మాంత్రికుడి మాటలు నమ్మి కన్న కూతురిని చంపేశాడు ఒక వ్యక్తి.

వివరాల్లోకి వెళితే రాంచీ, లోహర్ దగ్గరున్న పెష్రార్ లో ఉండే సుమన్ నగాసియా (26) కూలీగా పని చేస్తూ పొట్ట నింపుకుంటాడు.అతడికి ఆరేళ్ల కూతురు ఉంది.

కొడుకు కావాలనే కోరిక తో నగాసియా సుజాన్ ఓజా అనే మాంత్రికుడిని సుమన్ సంప్రదించాడు.దాంతో ఆ మాంత్రికుడు తన కూతురు ను బలి ఇస్తే కొడుకు పుడతాడని తెలిపాడు.ఏది నిజం , ఏది నమ్మా లో ఆలోచించని సుమన్ తన కూతురు ని అత్యంత కిరాతకంగా చంపి తల నరికేశాడు.ఇంట్లో అతని భార్య లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడి కట్టాడు.

ఈ దారుణం పై సమాచారం అందుకున్న పోలీసులు సుమన్ ను అరెస్ట్ చేశారు.మాంత్రికుడు కోసం గాలిస్తున్నారు.దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

#Jharkhand #Daughter #Murdered #Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Father Who Brutally Beheaded His Daughter To Give Birth To A Son Related Telugu News,Photos/Pics,Images..