సమంత శృంగార సన్నివేశాలు అందుకే తీసేశారా.. ఏమైందంటే..?

స్టార్ హీరో ప్రభాస్ కు బాహుబలి సిరీస్ ఏ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిందో ప్రముఖ నటి సమంతకు ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ కూడా అదే స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది.రాజీ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమంత ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్లలో సైతం నటించారు.

 The Family Man 2s Shahab Ali Confirms Those Scenes Were Edited Out , Ali Confirm-TeluguStop.com

అయితే సమంత ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో నటించిన సన్నివేశాలలో చాలా సీన్లు తీసేశారని సమాచారం అందుతోంది.

అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెర్షన్ లో మాత్రమే విడుదలైన ఈ వెబ్ సిరీస్ త్వరలో తెలుగు, తమిళ భాషల్లో సైతం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.12 సంవత్సరాల సమంత సినీ కెరీర్ లో ఈ సినిమాలోని పాత్రకు దక్కిన ప్రశంసల స్థాయిలో మరే సినిమాకు ఆమెకు ప్రశంసలు దక్కలేదు.ఈ వెబ్ సిరీస్ తో సమంతకు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు రావడంతో పాటు బాలీవుడ్ లో సైతం సమంత పేరు మారుమ్రోగుతోంది.

అయితే వెబ్ సిరీస్ లో సమంతకు సంబంధించిన బోల్డ్ సీన్లు మరికొన్ని ఉన్నాయని ఫైనల్ ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తొలగించారని సమాచారం.ఈ వెబ్ సిరీస్ లో నటించిన షాహబ్ అలీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

సినిమా నిడివితో పోలిస్తే వెబ్ సిరీస్ నిడివి ఎక్కువని అయితే డైరెక్టర్లు అనవసరమైన సీన్లను తొలగించి వెబ్ సిరీస్ కు ప్లస్ అయ్యే సీన్లను మాత్రమే ఉంచుతారని షాహబ్ అలీ అన్నారు.

Telugu Ali Confirms-Movie

లాజిక్ లేని సీన్లను డిలేట్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఎక్కువగా బోల్డ్ సీన్లు ఉంటే మాత్రం సమంతకు ఈ స్థాయిలో ప్రశంసలు అయితే వచ్చేవి కావనే చెప్పాలి.అయితే కొందరు నెటిజన్లు మాత్రం వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ సీన్లు ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube