హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం..సెల్ ఫోన్ ఆధారంగా చిక్కిన నిందితులు..!

The Extra-marital Affair That Led To The Murder Accused Caught On The Basis Of Cell Phone , Extra-marital Affair , Cell Phone, Abdul Nadeem Taher, Mughalpur, Shahzad

అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు కేసును చేదించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

 The Extra-marital Affair That Led To The Murder Accused Caught On The Basis Of C-TeluguStop.com

మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.సెప్టెంబర్ 12న అబ్దుల్ నదీమ్ తాహెర్( Abdul Nadeem Taher ) అనే వ్యక్తి పటాన్ చెరువు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు.

ఇతను నిర్మల్ జిల్లా బైంసా కు చెందిన నివాసి.మృతుడి సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Telugu Cell Phone, Extra, Mughalpur, Shahzad-Latest News - Telugu

మొఘల్ పూర్( Mughalpur ) కు చెందిన ఓ యువతితో అబ్దుల్ నదీమ్ తాహెర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఆ యువతి భర్త షహజాద్( Shahzad ) కు ఈ అక్రమ సంబంధం గురించి తెలియడంతో నదీమ్ తాహెర్ ను రెండు నెలల క్రితమే గట్టిగా మందలించాడు.అయినా కూడా అబ్దుల్ నదీమ్ లో ఎటువంటి మార్పు రాలేదు.ఇక షహజాద్ కు ఏం చేయాలో తెలియక మంచి సమయం దొరికితే ఏకంగా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

అబ్దుల్ నజీమ్ హైదరాబాద్ లో ఉండే సోదరి ఇంటికి వెళ్తున్నాడని తెలిసి హత్య చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించాడు.షహజాద్ తన బంధువు గౌస్ నుండి కొన్ని కత్తులు, గొడ్డలి సేకరించి స్నేహితులు షబ్బీర్ అహ్మద్, ఏజాజ్ అలీ సహాయం తీసుకున్నాడు.

Telugu Cell Phone, Extra, Mughalpur, Shahzad-Latest News - Telugu

టోలిచౌకిలో ఉన్న నదీమ్ కు ఫోన్ చేసి మాట్లాడుకుందామని షహజాద్ బయటికి రావాలని కోరడంతో.నదీమ్ ఒక హోటల్ వద్ద షహజాద్ ను కలిశాడు.కాసేపటి తర్వాత సంగారెడ్డి లోని దాబాకు వెళ్దామని ఇద్దరూ బైక్ పై బయలుదేరారు.మార్గమధ్యంలో లక్డారం వద్ద నదీమ్ మూత్ర విసర్జన చేసేందుకు ఆగాడు.చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు లేవు అని ధ్రువీకరించుకున్న తర్వాత అతడిపై గొడవకు దిగారు.పథకం ప్రకారం కత్తులతో, గొడ్డలితో దాడి చేసి నదిన్ను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.గౌస్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube