పవన్ నువ్వు పరిణితి చెందాలోయ్..!!     2018-12-04   14:25:59  IST  Surya

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక బ్రాండ్ ఇమేజ్ ని సినిమా రంగంలో తీసుకువచ్చారు కూడా. అయితే అదే ఇమేజ్ ని రాజకీయాల్లో సైతం కొనసాగించడంలో మాత్రం పవన్ చతికల పడుతున్నారు ,దిగజారి పోతున్నారు.అసలు పవన్ కళ్యాణ్ కి ఏమయ్యింది..?? నీతి సూక్తులు చెప్పడంతోనే సరిపోదు వాటిని ఆచరించాలనే కామన్ సెన్స్ ఎక్కడికి పోయింది..?? ఇప్పుడు తానొక నటుడు కాదు ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకుడు కూడా. తక్కువ కాలంలో ఎంతో మంది అభిమాన సైనికులని సంపాదించిన ఏకైక వ్యక్తిగా పవన్ పేరొందాడు కానీ

The Experts Giving A Small Suggestion To Pawan Kalyan-Chandrababu Naidu Elections In AP Janasena Kalyan TDP Viral About YCP YS Jagan

ఇప్పడు పవన్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతోంది…అందుకు రీజన్ కేవలం జగనే అంటున్నారు. ఎందుకంటే జగన్ కి ఏపీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.వచ్చే ఎన్నికల్లో దాదాపు జగనే సీఎం అంటూ సర్వేలు కూడా తేల్చి చెప్తున్నాయి..ఎలాగో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో సీఎం అయ్యే చాన్స్ లేదు అంటున్నారు మరి ఇలాంటి సమయంలో జగన్ ని పవన్ తన స్థాయికి తగ్గట్టుగా విమర్శిస్తే పరవాలేదు కాని తన స్థాయికి దిగజారి మరీ విమర్శలు చేయడం పవన్ కొంప ముంచుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గత ఎన్నికల్లో బాబు కి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆయన ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం పై నాలుగు ఏళ్లలో ఒక్క సారి కూడా ప్రశ్నించలేదు…కాని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాత్రం అమాంతం ఏపీ ప్రజలపై ప్రేమని వలక బోస్తూ చేస్తున్న ప్రసంగాలు ప్రశ్నల వర్షాలు తట్టుకోలేక పోతున్నారు జనాలు. సరే ఎదో చేసుకుంటున్నాడు లే అంటుకుంటే..ఇప్పుడు జగన్ పై విమర్శలు చేస్తుండటం పవన్ ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నాడు అనే భావాన్ని కలిగిస్తోందని అంటున్నారు.

The Experts Giving A Small Suggestion To Pawan Kalyan-Chandrababu Naidu Elections In AP Janasena Kalyan TDP Viral About YCP YS Jagan

జగన్ పై పవన్ చేస్తున్న ఆరోపణలు ,వ్యాఖ్యలకి వైసీపీకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు కాని జనసేన పై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని అంటున్నారు. ప్రజలు మెచ్చే నాయకుడిని అదే ప్రజల ముందు బూచిని చేసి చూపించాలని అనుకుంటే ప్రజల ముందు డమ్మీ అవుతాడు తప్ప ఒరిగేది ఏమి లేదనే విషయాన్ని ఒక పార్టీ అధినేతగా తెలుసుకోక పోవడం పవన్ మూర్ఖత్వానికి నిదర్శనమని, పవన్ పరిణితి చెందాలని అంటున్నారు పరిశీలకులు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.