అఖిల్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నారుగా... ముంచేనా? తేల్చేనా?

అక్కినేని అఖిల్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా భారీగా వసూళ్లు సాధించడం ఖాయంగా డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంగా ఉన్నారు.

 The Expectations High On Akkineni Akhil Lets See What Happens-TeluguStop.com

అందుకే ఈ చిత్రంను భారీ రేటుకు కొనుగోలు చేశారు.అఖిల్‌ గతంలో నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

దాంతో అఖిల్‌ మూడవ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు.కాని ఈ చిత్రంపై నమ్మకంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని భారీ మొత్తాలను పెట్టి కొనుగోలు చేశారు.

‘మిస్టర్‌ మజ్ను’ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి 23 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది.డిస్ట్రిబ్యూటర్లు బయట పడాలంటే ఈ చిత్రం దాదాపుగా 25 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టాల్సి ఉంది.అంటే 45 కోట్ల మేరకు గ్రాస్‌ వసూళ్లు దక్కించుకోవాలి.పెద్దగా క్రేజ్‌ లేని అఖిల్‌ ఇంత భారీ మొత్తంలో గ్రాస్‌ను రాబట్టాలి అంటే సినిమా ఖచ్చితంగా హిట్‌ అవ్వాలి.

అలా అయితేనే ఈ స్థాయి వసూళ్లు దక్కుతాయి.ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్లు చాలా నమ్మకంగా ఉండటం వల్లే ఈ స్థాయిలో ఖర్చు చేసి కొనుగోలు చేశారు.

అఖిల్‌ మొదటి సినిమా 40 కోట్ల బిజినెస్‌ చేస్తే కనీసం 10 కోట్లు కూడా వసూళ్లు చేయలేదు.ఆ తర్వాత ‘హలో’ చిత్రం కూడా మంచి బిజినెస్‌ చేసింది.కాని అందులో సంగం కూడా రాబట్టలేక పోయింది.ఇక మూడవ సినిమా 23 కోట్ల బిజినెస్‌ చేసింది.మరి ఈ మొత్తంను అయినా రాబట్టి డిస్ట్రిబ్యూటర్లను అఖిల్‌ తేల్చుతాడేమో చూడాలి.మొదటి రెండు సినిమాలతో ముంచిన అఖిల్‌ మూడవ సినిమాతో కూడా ముంచితే మాత్రం ఇక ఆయన కెరీర్‌ పరిస్థితి అందోళనకమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొన్ని గంటల్లో మిస్టర్‌ మజ్ను చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube