బాబు ప్రభుత్వం పై వచ్చిన అభియోగాలపై విచారణ  

The Enquiry Into The Accusations Made By The Babu Government-

పిల్లి పోయే ఎలుకా వచ్చే ఢాం ఢాం ఢాం అన్నట్లు గా ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రాగానే గతంలో అధికారంలో ఉన్న పార్టీ పై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపిస్తామంటూ పెద్ద హడావుడి చేసేస్తారు నేతలు అందరూ.ఇప్పుడు ఏపీ లో కూడా అదే పరిస్థితి.మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే..

The Enquiry Into The Accusations Made By The Babu Government--The Enquiry Into Accusations Made By Babu Government-

ఇక ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది.అందుకే నిన్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందో లేదో ఆ పార్టీ నేతలు తమతమ స్థాయిలో టీడీపీ పార్టీ పై, నేతల పై విరుచుకు పడుతున్నారు.తాజాగా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా బాబు ప్రభుత్వం పై వఛ్చిన ఆరోపణల పై ఖఛ్చితంగా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ సర్కార్ తో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వచ్చిన ఆరోపణల పైన కూడా విచారణ జరుపుతామని అంబటి వ్యాఖ్యానించారు.

అయితే గత ప్రభుత్వం పై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశ్యం మాత్రం తమకు లేదని, కానీ ఆ ప్రభుత్వం పై వచ్చిన అభియోగాలపై విచారణ మాత్రం తప్పదు అంటూ అంబటి వ్యాఖ్యానించారు.30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సారి ఎన్నికల్లో అంబటి విజయం సాధించారు.ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే కేబినేట్ లోకి నన్ను తీసుకోవాలా? లేదా? అనే విషయంపై జగనే నిర్ణయం తీసుకుంటారని అంబటి వ్యాఖ్యానించారు.