సోషల్ మీడియా అంటేనే ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకునే వేదిక.ఇందులో ఎన్నో అవసరమైన విషయాలను తెలుసుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా ఖాళీ సమయాల్లో వినోదాన్ని అందించడానికి కూడా సోషల్ మీడియా ఇప్పుడు యువతకు బాగా ఉపయోగ పడుతుంది.
ఇందులో రోజు కొత్త కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి.మనల్ని అలరిస్తూనే ఉంటాయి.
తాజాగా క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ వీడియో నెటిజెన్స్ ను బాగా అలరిస్తుంది.అందులో ఏనుగులు చేసిన అల్లరికి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.ఏనుగులు సహాజంగానే వాటి జోలికి వెళ్లక పోతే మనల్ని ఏమి చేయవు.
వాటి మానాన అవి ఉంటాయి.కానీ మనుషులు అడవుల్ని నరికేస్తూ ఉండడం వల్ల తరచు ఏనుగుల గుంపు ప్రజలు తిరిగే ప్రదేశాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి.
కానీ ఈ వీడియోలో ఈ ఏనుగులను చుస్తే ఎంత బాగా ఆడుకుంటున్నాయో వెంటనే అర్ధం అవుతుంది.
అవి వాటి ప్రపంచంలో ఆనందంగా జీవిస్తున్నాయి.అంత పెద్ద ఏనుగులు కూడా మనుషులలాగా అందులోను చిన్న పిల్లలలా అల్లరి చేస్తూ కనిపించే సరికి నెటిజెన్స్ కు ఈ వీడియో బాగా నచ్చింది.ఏనుగులు ఎక్కువుగా నీటిలో ఆదుకోవడానికి ఇష్ట పడుతుంటాయి.
నీళ్లు కనిపిస్తే చాలు వాటిలో ఆడుతూ సరదాగా ఉంటాయి.ఈ వీడియోలో కూడా ఏనుగులు బురద ఉన్న ఒక వాలులో దిగుతూ చేసిన అల్లరికి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.చిన్న ఏనుగు పిల్లలే కాదు పెద్ద ఏనుగులు కూడా వాటితో పాటు పెద్ద ఏనుగులు కూడా అల్లరి చేస్తూ ఆ వాలులో జారడం కనిపించింది.ఏనుగులు అలా ఎంజాయ్ చేయడం చూసి అందరు ఆనందిస్తున్నారు.
ఈ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.