బాగుంది బాగుంది అంతా బాగుంది .. సొంత సర్వేలతో పార్టీల సెల్ఫ్ గోల్ఫ్  

రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు సర్వేల మాయలో పడిపోయాయి. పార్టీలైనా , ప్రభుత్వమైనా ముందుకు వెళ్లాలన్నా.. వెనక్కి వెళ్లాలన్నా ఏమి చెయ్యాలన్నా ముందుగా చేసే పని సర్వే ! మాములు రోజుల్లో చేసే సర్వేలు ఒక ఎత్తు అయితే ఎన్నికల సమయంలో చేయించే సర్వేలు ఒక ఎత్తు. ఎన్నికలు సమీపిస్తున్నాయి సమయంలో ఇక మొత్తం సర్వే రిపోర్టుల మీదే పార్టీలన్నీ ఆధారపడిపోతుంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పార్టీలు నిర్వహించే సర్వేలు ఏమి లెక్క తేల్చినా పార్టీలు మాత్రం అంతా తమకు అనుకూలంగా ఉన్నట్టుగానే ప్రకటిస్తున్నాయి. దీనికి కారణం ఈ సర్వేల మాయతో వచ్చే ఎన్నికల్లో విజయ జెండా ఎగరవెయ్యాలని ఆశించడమే.

The Electoral Math Behind Contest For 2019 Elections-

The Electoral Math Behind The Contest For 2019 Elections

కొన్ని పార్టీలు చెబుతున్న సర్వే లెక్కలు కొంచెం నామీలా ఉన్నా మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అసలు ఇదెలా సాధ్యం అని అనిపిస్తూనే ఎన్నో సందేహాలు, యక్ష ప్రశ్నలు కలుగుతుంటాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే! అసలు ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది కూడా సందేహమే! ఆ పార్టీ తరఫున అసలు ఎవరైనా పోటీకి దిగుతారో లేదో తెలియని పరిస్థితి. మరి అలాంటి పార్టీకి ఇప్పుడు ఏడు ఎంపీ సీట్లు వస్తాయని సర్వే ద్వారా తేలింది అని చెప్పడం ఎంతవరకు నమ్మాలి.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఏడు ఎంపీ సీట్లు వస్తే.. కాంగ్రెస్‌కు మూడు ఎంపీ సీట్లు వస్తాయట. నమ్మడానికి కూడా అసలు ఊహించని విధంగా ఉన్న ఈ ఫలితాలు.. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఇక టీడీపీ, వైసీపీ సర్వేల్లోనూ తామే గెలుస్తామని పార్టీలు గొప్పగా చెప్పేసుకుంటున్నాయి. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో టీడీపీకి కేవలం 30 సీట్లు మాత్రమే వస్తాయని జగన్ గట్టిగా చెప్తున్నాడు.

The Electoral Math Behind Contest For 2019 Elections-

ఇక సీఎం చంద్రబాబు గురించి, ఆయన సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి.. ఆయన సర్వేలు నిర్వహించడం, ఫలితాలను బట్టి ప్రణాళికలు రచించడం వంటివి చేస్తుంటారు. ఆయన నిర్వహించిన సర్వేలోనూ టీడీపీకి 100 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతూ ఉంటారు. ఇక అధికారం తమదే అని బాబు చెప్తూ ఉంటారు. ఇలా ఎవరికి వారు తమ సొంత డప్పు కొట్టుకుంటూ అసలు ఏ సర్వేను నమ్మాలి ఏ సర్వేను నమ్మకూడదు అనే గందరగోళాన్ని ప్రజలకు అంటగట్టేసారు.