తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం..!!

త్వరలో తిరుపతి పార్లమెంట్ కి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

 The Election Commission New Decision In Tirupathi By Elections , Tirupathi, Ec,-TeluguStop.com

వైసిపి పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో రాబోతున్న ఈ ఉప ఎన్నికలలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే ప్రధాన పార్టీల అధ్యక్షులు తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.వైసీపీ పార్టీ తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, జనసేన బీజేపీ కూటమి నుండి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుండి చింతామోహన్ పోటీకి రెడీ అవుతున్నారు.

ఇటువంటి తరుణంలో ఈ ఉప ఎన్నిక విషయంలో ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది.మేటర్ లోకి వెళితే ఇటీవల నగరపాలక సంస్థ ఎన్నికలు జరగటంతో ఓటర్లకు ఎడమచేతి పై సిరా గుర్తు వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఎన్నికలలో ఎడమచేతికి బదులు కుడి చేతికి సిరా గుర్తు వేయటానికి ఎన్నికల సంఘం రెడీ అయింది.నగర పాలక సంస్థల ఎన్నికల టైంలో వేసిన గుర్తు ఇంకా తిరిగి చెరిగిపోకపోవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube