ప్రస్తుత కాలంలో కులాలు, మతాలు అనే తేడా లేకుండా యువతీ,యువకులు ప్రేమలో పడుతున్న సంగతి తెలిసిందే.కులాంతర వివాహాలకు ఇరు కుటుంబ పెద్దలు అంగీకారం తెలపరననే విషయం తెలిసిందే.
అంతేకాదు ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులతో ప్రేమలో పడితే కుటుంబ సభ్యులు దాడులు చేయడానికి కూడా వెనుకడుగు వేయరు.ఇలాంటి కోవకు చెందిన ఓ ప్రేమ బీహార్( Bihar ) లో చోటు చేసుకుంది.
చివరికి ఎన్నో మలుపులు తిరిగిన ఈ ప్రేమ కథకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
బీహార్ లోని అరారియా( Araria in Bihar ) జిల్లాలో చోటు కుమార్ ఠాకూర్, రూప లు ప్రేమించుకున్నారు.
వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో రూప కుటుంబ సభ్యులు వీరి ప్రేమ వివాహానికి అంగీకారం తెలుపలేదు.దీంతో రూప తన కుటుంబ సభ్యులకు తెలియకుండా జూన్ 2న చోటు కుమార్ ఠాకూర్ ను ప్రేమ వివాహం చేసుకొని అత్తింటికి వెళ్ళిపోయింది.
ఈ ప్రేమ పెళ్లి విషయం రూప తల్లిదండ్రులకు తెలియడంతో తమ పరువు పోయిందని, ఈ సంఘటనను జీర్ణించు కోలేకపోయారు.ఎలాగైనా రూపం తమ ఇంటికి తీసుకురావాలని పక్కాగా కిడ్నాప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించారు.ఇక రూప సోదరుడు మరో వ్యక్తి సహాయంతో రూప అత్తారింటికి వెళ్లి, చేతులు కదలకుండా పట్టుకుని బైక్ పై రూప ను తీసుకువెళ్లాడు.ఇదంతా స్థానికులు ఫోన్లో వీడియోలు కూడా తీశారు.
రూప భర్త చోటు కుమార్ ఠాగూర్ స్థానిక బహనాథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రూప సోదరుడుతో పాటు ఇతనికి సహాయం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.కిడ్నాప్ కు గురైన రూప స్టేట్మెంట్ తీసుకున్నాక ఈ ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.