నటి రికార్డును బద్దలుకొట్టిన గుడ్డు..! 2.6 కోట్ల మంది ఎందుకు దీన్ని లైక్ చేశారు? వెనకున్న కథ ఇదే.!

హాలీవుడ్ నటి, మోడల్‌ కైలీ జెన్నర్‌ ప్రపంచ రికార్డ్‌ను చేజార్జుకుంది.ఆ రికార్డ్‌ను కొల్లగొట్టింది మరో సెలబ్రిటీనో, లేక మోడలో కాదు.

 The Egg Breaks Actress Record In Social Media-TeluguStop.com

ఓ గుడ్డు.గతేడాది ఫిబ్రవరిలో కైలీ జెన్నర్ తనకు పుట్టిన పాప ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

శిశువు తన తల్లి చేతి బొటనవేలిని పట్టుకున్నట్టు ఉంది.ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.ఇప్పటి వరకు ఈ ఫొటోకు 18.1 మిలియన్లకుపైగా లైకులు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోకు ఇన్ని లైకులు రావడం ఇదే తొలిసారి.దీంతో ఆ ఫొటో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

తాజగా…ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎగ్‌ గ్యాంగ్‌’ అనే ఖాతా ముదురు గోధుమ రంగులో ఉన్న గుడ్డు ఫొటోను పోస్ట్‌ చేసింది.ఈ ఫొటోను ఇప్పటి వరకు 18.2 మిలియన్ల‌ మంది లైక్‌ చేశారు.దాంతో కైలీ సాధించిన ప్రపంచ‌ రికార్డ్‌ కాస్తా ‘ఎగ్‌ గ్యాంగ్‌’ దక్కించుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ క్వీన్ అయిన కైలీ తన రికార్డు బద్దలు కావడంపై వెరైటీగా స్పందించింది.ఎగ్ గ్యాంగ్ పోస్టు చేసిన గుడ్డులాంటి దానినే నేలపై పగలగొట్టి ప్రతీకారం తీర్చుకుంది.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.ఈ వీడియోకు కూడా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 14 మిలియన్ల లైకులు వచ్చాయి.

@world_record_egg అనే అకౌంట్ ద్వారా జనవరి 4వ తేదీన ఒక గుడ్డు ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.ఫోటోకి కాప్షన్ గా ‘అందరం కలసి ప్రపంచ రికార్డు సృష్టిద్దాం.ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా లైక్ చేసిన పోస్ట్‌ను సృష్టిద్దాం.కెలీ జెన్నర్ (1.8 కోట్ల లైకులు) రికార్డును బద్దలు కొడదాం! మన వద్ద ఉంది ఇదే’ అని పెట్టారు.అప్పటి నుంచి (జనవరి 14 సాయంత్రం 5 గంటల వరకు) ఈ పోస్టుకు 2.6 కోట్ల లైకులు వచ్చాయి.దీంతో ఇప్పటి వరకూ ఇన్‌స్టాలో అత్యధిక లైకులు సాధించిన ఫొటో రికార్డు బద్దలయ్యింది.

అది మరి గుడ్డు రికార్డు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube