మధుమేహం కారణంగా శరీరంలో కలిగే కీలకమైన మార్పులు  

మధుమేహం అనేది చాలా భయంకరమైన మరియు సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చుమధుమేహం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకుంటూ కంట్రోల్ లఉంచుకోవాల్సిందే.అలాగే ఆహార నియమాలను కూడా పాటించాలి.ఈ రోజుల్లవయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటిగమధుమేహం ఉంది.

The Effects Of Diabetes On Your Body--

అలాంటి మధుమేహం కారణంగా మన శరీరంలో వచ్చే కీలకమైన మార్పుగురించి వివరంగా తెలుసుకుందాం.

రక్తంలో చెక్కర కారణంగా రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోయి రక్తనాళాలసన్నపడతాయి.దీని కారణంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.నిజానికిమధుమేహ వ్యాధిగ్రస్తులలో హృద్రోగ మరణాలు కలిగే అవకాశం నాలుగురెట్లఅధికంగా ఉంటుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో రోజులు గడుస్తున్న రక్తప్రసరణ సరిగ్గా జరగనరాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.సాధారణంగా చేతులు,కాళ్ళు మరియవేళ్ళలో స్పర్శ కోల్పోతారు.దాంతో ఆ ప్రదేశాలలో ఏవైనా గాయాలు అయితతొందరగా తెలుసుకోలేరు.మధుమేహం కారణంగా మూత్రపిండాలలోని రక్తనాళాలు దెబ్బతింటాయి.దాంతో అవరక్తంలోని వ్యర్థ పదార్థాలను వడకట్టడంలో విఫలం అవుతాయి.చివరికి పరిస్థితి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

మధుమేహం కారణంగా వచ్చే మైక్రో వాస్క్యూలర్ సమస్యల వలన శరీరంలరక్తప్రసరణ సరిగా జరగదు.

దాంతో శరీరంపై, ముఖ్యంగా కొనలకు అయిన గాయాలమానడానికి చాలా కాలం పడుతుంది.అంతేకాకుండా చెక్కెరలు అధికంగా ఉన్కణజాలాలలో బాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది, గాయాలను పుండ్లుగా తొందరగమార్చేస్తుంది.ఆ పుండ్లు కూడా చాలా రోజుల వరకు తగ్గవు.