పంజాబ్ ముఖ్యమంత్రి కి ఈడి సరికొత్త షాక్..!!

మరికొద్ది రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

 Ed Raids Punjab Chief Minister Charanjith Singh Relatives Homes Details,  Punjab-TeluguStop.com

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు వల్ల.ముఖ్యమంత్రి పదవికి అమరేందర్ సింగ్ రాజీనామా చేయగా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి చరన్ జిత్ సింగ్ నీ.కాంగ్రెస్ హైకమాండ్ కూర్చోబెట్టడం జరిగింది.ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్… బంధువుల నివాసాలలో ఏకకాలంలో ఈడి.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడం పంజాబ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మొహాలీలో ముఖ్యమంత్రి బంధువు భూపేందర్ సింగ్… నివాసంతో పాటు పది ప్రాంతాలలో మరియు కార్యాలయాలలో నివాసాలలో… ఈడి అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది.

భూపిందర్ సింగ్ అనే వ్యక్తి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించారు.దీంతో ఆ సంస్థను అడ్డం పెట్టుకుని నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు… ఈడి అనుమానిస్తూ ఉండటంతో కంపెనీకి చెందిన కాంట్రాక్టర్లు ఇంకా… ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించిన ఇళ్లపై… సోదాలు నిర్వహిస్తున్నారు.

పంజాబ్ రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టర్లు మరియు.ఇసుక మాఫియా విషయంలో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమని ఆమ్ఆద్మీ పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో.ఈడి అధికారులు సోదాలు చేయడం పంజాబ్ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube