ఉధృతంగా వ‌స్తున్న వాగును దాటేందుకు ట్రై చేసిన ట్ర‌క్కు డ్రైవ‌ర్‌.. చివ‌ర‌కు..!

వానాకాలంలో మ‌న‌కు ఎన్నో ర‌కాల వింత ఘ‌ట‌న‌లు క‌నిపిస్తూనే ఉంటాయి.అయితే అందులో ఎక్కువ‌గా ప్ర‌మాదాల‌కు సంబంధించిన వీడియోలే మ‌న‌కు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇస్తూ ఉంటాయి.

 The Driver Of The Truck That Tried To Cross The Raging Brook  To The End , Truck-TeluguStop.com

ఎందుంక‌టే వానాకాలంలో ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌దుల‌ను దాటేందుకు ట్రై చేసి చాలామంది చివ‌ర‌కు అదే న‌దిలో లేదా వాగులో కొట్టుకుపోయిన ఘ‌ట‌న‌లు అనేకం మ‌న కండ్ల‌కు నీళ్లు తెప్పిస్తూనే ఉంటాయి.ఇక ఇప్పుడు కూడా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తీవ్ర ఆవేద‌న రేపుతోంది.

అయితే అది మ‌న దేశంలో జ‌రిగిన ఘ‌ట‌న కాదు.

వాస్త‌వానికి ఇలాంటి ఘ‌ట‌న‌కు మ‌న దేశంలోనే అనేకం జ‌రుగుతూ ఉంటాయి.

కానీ ఈ సారి రష్యా దేశంలో ఓ ట్రక్ పొడ‌వాటి పెద్ద నదిపై ఉన్న వంతెనను దాటేందుకు ట్రై చేయ‌గా జ‌రిగిన ప్ర‌మాదం ఇది.ఆయ‌న న‌దిని దాటేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా వంతెన ఒక్కసారిగా విరిగిపోయి ఆయ‌న నీటిలో పడిపోయాడు.ఆక ఆయ‌న అదృష్టం బాగున్న‌ట్టు ఉంది.ఎందుకంటే ఆయ‌న తృటిలో తప్పించుకుని త‌న ప్రాణాల‌ను కాపాడుకున్నాడు.రీసెంట్ గానే తూర్పు రష్యాలోని ఓ ప్రాంతంలో ఫేమ‌స్ అయిన నదిలో వరదలు వ‌చ్చాయి.

ఇక దీనిపై ఉన్న వంతెన సాయంతో ఓ ట్ర‌క్కు డ్రైవర్ న‌దిని దాటాలని తెగ ప్రయత్నించాడు.

కానీ ట్రక్కును వంతెనపైకి ఎక్కించ‌గానే ఆయ‌న బ్యాల‌న్స్ త‌ప్పాడు.కానీ అలాగే ముందుకు రావ‌డంతో స‌రిగ్గా మధ్యలోకి రాగానే బ్యాల‌న్స్ ఆప‌లేక ఒక్క సారిగా వంతెన మొత్తం న‌దిలో కుప్పకూలిపోయింది.

వెంట‌నే అల‌ర్ట్ అయిన డ్రైవర్ ఈత కొడుతూ న‌ది నుంచి బ‌య‌ట ప‌డ్డారు.కాగా ఈ వంతెన‌ను చెక్కతో తయారు చేశారని తెలుస్తోంది.కాగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ప్ర‌స్తుం దీన్ని దాటాలంటేనే స్థానికులు భ‌య‌ప‌డుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube