అమెరికా వలసదారుల్లో భారతీయులే అధికం..తాజా సర్వే     2018-09-18   15:39:33  IST  Bhanu C

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు వలసదారులపై ఉక్కు పాదం మోపుతూ వలసలని నిరోదిస్తుంటే మరో వైపు అమెరికాలో వలస దారుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది..రికార్డ్ స్థాయిలో ఈ సంఖ్య పెరగడం గమనార్హం

గత వారం అమెరికా జనాభా లెక్కల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే దేశ జనాభాలో 14శాతం వలసదారులు(విదేశీయులు)ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట.

అయితే మొత్తం దేశ జనాభాలో 14శాతం వలసదారులు ఉండటం షాకింగ్ న్యూస్ అని సెంటర్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌(సిఐఎస్‌) పేర్కొంది…అయితే ఈ వలసల్లో అక్రమంగా వచ్చిన వారు సక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారని పేర్కొంది..అయితే 2010 –2017 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్‌ నివేదిక వెల్లడించింది.

అయితే భారత్ తరువాత స్థానంలో తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%)…డొమినికన్‌ రిపబ్లిక్‌(2.83 లక్షలు–32%) ఉన్నాయి…2017, జులై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు…పాకిస్తాన్‌ నుంచి 4 లక్షల మంది అమెరికా వెళ్ళినట్టుగా సీఐఎస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి…2010–17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు…అమెరికా జనాభా లెక్కల కేంద్రం నిర్వచనం ప్రకారం విదేశీయులంటే జన్మతః అమెరికన్లు కానివారు…అమెరికా వచ్చి ఆ తర్వాత పౌరసత్వం.. గ్రీన్‌కార్డు పొందిన వారు.. హెచ్‌1బీ వీసాదారులు..విదేశీ విద్యార్థులను కూడా వలసదారులుగానే పరిగణిస్తారు.

The Donald Trump Survey on Immigrants in America-NRI,NRI Updates,Telugu NRI News,The Donald Trump Survey On Immigrants In America

అయితే ఇటీవల కొంత కాలంగా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న వర్క్‌ వీసాల సంఖ్యను తగ్గించడం…తాత్కాలిక కార్మికుల వీసా గడువు పొడిగించకపోవడం, విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం, అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపేయడం వంటి చర్యల ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో దేశంలో విదేశీయుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సీఐఎస్‌ ఒక నివేదికలో పేర్కొంది.