అప్పుడే మొదలెట్టేశారా : అధికార పార్టీలో ఆధిపత్య పోరు ?  

The Dominate Rulling Party Leaders To Other Leaders-kolagattla Veerabhdra Swamy,rulling Party,vijayanagaram Mp Botsa Satyanarayana,ycp Cm Jagan Mohan Reddy

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరునెలలు అవుతోంది.ఈ ఆరునెలల కాలంలో ప్రజల మనసు గెలుచుకునేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తీవ్ర స్థాయిలో కష్టపడుతూ వస్తున్నాడు.సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ ఇలా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ముందుకు వెళ్తుండగా పార్టీ నాయకులూ, ఎమ్యెల్యేలు, మంత్రులు ఆధిపత్య పోరుతో కుమ్ములాడుకుంటూ పార్టీ పరువు బజారున పడేసే కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.దీంతో వైసీపీకి కొత్త తలనొప్పులు మొదలయినట్టు కనిపిస్తున్నాయి.

The Dominate Rulling Party Leaders To Other Leaders-kolagattla Veerabhdra Swamy,rulling Party,vijayanagaram Mp Botsa Satyanarayana,ycp Cm Jagan Mohan Reddy Telugu Political Breaking News - Andhra Prad-The Dominate Rulling Party Leaders To Other Leaders-Kolagattla Veerabhdra Swamy Rulling Vijayanagaram Mp Botsa Satyanarayana Ycp Cm Jagan Mohan Reddy

ఈ విషయాలు జగన్ వరకు వెళ్లినా కొత్తలో ఇలాగే ఉంటుందిలే అంతా మెల్లిగా సర్దుమణుగుతారు అన్నట్టుగా చూసి చూడనట్టుగా వదిలేస్తుండడంతో ఈ వ్యవహారాలు మరింతగా ముదిరిపోతున్నాయి.కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఆధిపత్యం చూపించేందుకు పోటీ పడుతుండగా, పార్టీ కోసం మేము కూడా ఎన్నో త్యాగాలు చేశామని, మమ్మల్ని తక్కువగా చూస్తారా ? అంటూ మిగిలిన నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ప్రతి జిల్లాలోనూ ఇదే తరహాలో అధికార పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.అయితే కొన్ని చోట్ల మాత్రం మితిమీరిన స్థాయిలో ఉన్నాయి.ముఖ్యంగా గుంటూరు, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మిగిలిన నాయకులను పట్టించుకోవడంలేదంటూ ఇక్కడ కీలకమైన నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి గుర్రుగా ఉన్నారు.

అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా బొత్స వర్గం పావులు కడుపుతుండడంపై ఈయన మండిపడుతున్నారు.పార్టీకి వీర విధేయుడినైన నాకే ఏమీ చెప్పకుండా, నన్ను లెక్క చేయ కుండా వ్యవహరిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో బొత్స డామినేషన్ తో మిగిలిన ఎమ్యెల్యేలంతా ఇదే తరహాలో ఇబ్బందిపడుతున్నారట.

గుంటూరు జిల్లా నాయకుల విషయానికి వస్తే ఈ జిల్లాలో ఉన్నంత ఆధిపత్య పోరు మరే జిల్లాలోనూ కనిపించదు అన్నట్టుగా ఉంది.చిలకలూరు పేట ఎమ్యెల్యే విడదల రజనీ కుమారి వర్సెస్ ఎంపీ లావు, ఎమ్మెల్యేలు రజనీ వర్సెస్‌ శ్రీదేవి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది.

అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఎమ్మెల్యే శ్రీదేవికి కూడా పడడం లేదు.అలాగే హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా ఎవరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని వెళ్లిపోవడంపైన విమ్మర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా కింది స్థాయి నాయకులు సుచరిత తీరుతో ఆగ్రహంతో ఉన్నారు.పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి గెలుపులో భాగమైన నాయకులను పట్టించుకోకపోవడంపై కింది స్థాయి నాయకులంతా ఆగ్రహంగా ఉన్నారు.

ప్రకాశం జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.ఇక్కడ జగన్ బంధువులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి హవా మాత్రమే నడుస్తుందాంతో మిగిలిన నాయకులు గుర్రుగా ఉన్నారు.ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలోనూ కనిపిస్తోంది.అంతర్గతంగా మొదలయిన ఈ ఆధిపత్య పోరు ముందు ముందు తీవ్రమై పార్టీ, ప్రభుత్వ పరువు బజారున పడేసే పరిస్థితి తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి.